E-Paper
Advertisement

Ghee : ఉదయాన్నే నెయ్యి తాగితే ఏమవుతుంది?

Ghee : ఉదయాన్నే నెయ్యి తాగితే ఏమవుతుంది?
Advertisement

Ghee : నెయ్యి.. ఆరోగ్యంతో పాటు మంచి రుచి, వాసనని ఇస్తుంది. ఏదైనా కూర మంటగా ఉందంటే కొంచెం నెయ్యి వేస్తే అది కమ్మగా ఉంటుంది. కొందరు మాత్రం నెయ్యి తినేందుకు ఇష్టపడరు. ఆయుర్వేదం ప్రకారం కూడా నెయ్యి చాలా ఆరోగ్యకరమైనదని నిపుణులు అంటున్నారు. ఈ నెయ్యితో మ‌న‌కు అనేక లాభాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి తాగ‌డం వ‌ల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో మ‌న శ‌రీరంలోని చిన్న పేగులు తిన్న ఆహారంలోని పోష‌కాల‌ను సమ‌ర్థవంతంగా శోషించుకుంటాయి. ఈ నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. ఆవు నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను అంతంచేస్తాయి. నెయ్యిని రెగ్యులర్‌గా తీసుకోవ‌డంతో వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. అంతేకాకుండా నెయ్యి మ‌న శ‌రీరాన్ని దృఢంగా మారుస్తుంది. శ‌రీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. ఇందులో ఉండే విట‌మిన్ ఎ, డి, ఇ, కెలు రోగ నిరోధ‌క శ‌క్తిని బాగా పెంచుతాయి. అంతేకాకుండా మన చ‌ర్మం, వెంట్రుక‌ల‌ను కాపాడుతాయి. కీళ్లను దృఢంగా చేయడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌నే అపోహ ఉంది. కానీ రోజూ ఒకటి లేదా 2 చెంచాల వరకు నెయ్యి తింటే బ‌రువు త‌గ్గుతార‌ని ఆయుర్వేదంలో ఉంది. నెయ్యి కారణంగా శ‌రీరంలో మొండిగా పేరుకుపోయి ఉండే కొవ్వు క‌రుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరుగుతుంది. శ్వాస‌ స‌మ‌స్యలు ఉంటే గ్లాసు గోరు వెచ్చని నీటిలో టీస్పూన్ ఆవు నెయ్యి క‌లుపుకుని తాగితే పొడి ద‌గ్గు త‌గ్గుతుంది. నెయ్యి తినడం వల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్దకం కూడా త‌గ్గుతుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×