E-Paper
Advertisement

T20 World Cup 2026: దేవుడు ఉన్నాడురా..ఇండియాను దెబ్బ‌కొట్టాల‌ని చూశారు, కానీ పాకిస్తాన్ కొంపకొల్లేరైంది

T20 World Cup 2026:  దేవుడు ఉన్నాడురా..ఇండియాను దెబ్బ‌కొట్టాల‌ని చూశారు, కానీ పాకిస్తాన్ కొంపకొల్లేరైంది
Advertisement

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026) నెల రోజుల సమయం కూడా లేదన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ( Pakistan ) ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా, బీసీసీఐపై కుట్రలు చేద్దామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ప్లాన్ వేస్తున్న నేపథ్యంలో వాళ్ల జట్టుకు చుక్కెదురు అయింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి హారిస్ రవూఫ్ అలాగే బాబర్ ఆజం ఇద్దరూ దూరంగా కాబోతున్నారట. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగబోతుందట పాకిస్తాన్ జట్టు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

ఆ ఇద్దరు లేకుండానే బరిలోకి పాకిస్తాన్ టీమ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026) సంబంధించిన ఫైనల్ జట్టును ఇంకా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదీలోపు అన్ని జట్లు తమ ప్లేయర్ల లిస్టును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, త్వరలోనే పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ జట్టుకు సల్మాన్ అఘా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మహమ్మద్ రిజ్వాన్ కు కూడా ఈ జట్టులో చోటు దక్కనుంది. అటు షాహీన్ అఫ్రిదికి వైస్ కెప్టెన్సీ ఇస్తారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన బాబర్ ఆజం అలాగే హారిస్ రవూఫ్ ( HARIS RAUF) లాంటి స్టార్ ప్లేయర్లు ఈ మెగా టోర్నమెంట్ కు దూరం అవుతారట.

బిగ్ బాస్ లీగ్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న హారిస్ రవూఫ్… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అటు 2024 నుంచి ఎక్కడ కూడా పెద్దగా రాణించలేదు మాజీ సార‌ధి బాబ‌ర్ ఆజం ( BABAR AZAM). వరుసగా ఫ్లాఫ్ అవుతూ వస్తున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో కూడా అతనికి చోటు దక్కలేదు. ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నప్పటికీ కూడా.. పెద్ద‌గా రాణించడం లేదు. ఈ కారణాల వల్ల ఈ ఇద్దరు ప్లేయర్లు టీ20 ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ కు దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

బంగ్లా పేరుతో పాకిస్తాన్ కుట్ర‌లు

Advertisement

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నేప‌థ్యంలో వేదిక‌లు మార్చాల‌ని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ మ్యాచ్ లు పాకిస్తాన్ లో పెట్టాల‌ని బంగ్లా కోరుతోంది. దీనికి ఐసీసీ ఒప్పుకోవ‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో బీసీసీఐని ఇరికించాల‌ని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కుట్ర‌కు తెర‌లేపింది. బంగ్లాదేశ్ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, లేక‌పోతే, మేం కూడా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నుంచి త‌ప్పుకుంటామ‌ని వార్నింగ్ ఇస్తోంది పాకిస్తాన్‌. ఇలాంటి నేప‌థ్యంలోనే బాబ‌ర్‌, హారిస్ జ‌ట్టుకు దూరం కాబోతున్నార‌ని వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో దేవుడు ఉన్నాడురా అంటూ మ‌న ఇండియ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×