E-Paper
Advertisement

Bank Holidays: ఈ నెలలో వరుసగా 4 రోజుల బ్యాంకు సెలవులు.. ఎందుకంటే?

Bank Holidays: ఈ నెలలో వరుసగా 4 రోజుల బ్యాంకు సెలవులు.. ఎందుకంటే?
Advertisement

Bank Holidays: ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఐదు రోజుల షిఫ్ట్ డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు జనవరి 27న సమ్మె ప్రకటించారు. జనవరి 24న నాల్కో శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే తో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. సమ్మె కొనసాగితే బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి.

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్

దేశ వ్యాప్తంగా బ్యాంకు సిబ్బందికి వారానికి 5 రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తామని అంటున్నారు. ఐదు రోజుల షిఫ్ట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. దీంతో సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గి, సామర్థ్యాన్ని మెరుగుపడుతుందని, తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుందని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారు. మన దేశంలో చాలా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఇప్పటికే ఐదు రోజుల షెడ్యూల్‌ను ఫాలో అవుతున్నాయని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. తమకు కూడా ఐదు రోజుల షెడ్యూల్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Also Read:రూ.1500 కంటే తక్కువ ధరలో 20000mAh పవర్ బ్యాంక్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్

ఈ సంస్థల్లో ఇప్పటికే ఐదు రోజులు

బ్యాంకు కస్టమర్లకు ఇబ్బంది లేకుండా సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 40 అదనపు నిమిషాలు పని చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రతిపాదించింది. RBI, LIC, GIC, స్టాక్ మార్కెట్లు, ఫారెక్స్, మనీ మార్కెట్లు ఇప్పటికే శనివారాలు పనిచేయడం లేదని ఉద్యోగులు అంటున్నారు.
UFBU అనేది తొమ్మిది ప్రధాన బ్యాంకు సంఘాలకు జేఏసీ. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు ఉమ్మడి సంఘం. అయితే ఈ సంఘం డిమాండ్ చేస్తున్నట్లు దేశంలో విస్తృతమైన బ్యాంకింగ్ వ్యవస్థలో ఐదు రోజుల షెడ్యూల్ అమలు చేయడం అంత సులభం కాదని RBI భావిస్తోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×