E-Paper
Advertisement

PAK T20 WC-Ramadan: రంజాన్ సెంటీమెంట్ కాదు, ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా పాకిస్తాన్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌దు

PAK T20 WC-Ramadan: రంజాన్ సెంటీమెంట్ కాదు, ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా పాకిస్తాన్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌దు
Advertisement

PAK T20 WC-Ramadan:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ ఛాంపియన్ కాబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో ఆ అల్లాహ్ ( Allah) పాకిస్తాన్ జట్టుకు అండగా నిలుస్తాడని కూడా పోస్టులు పెడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ ప్రముఖ హోస్ట్ తబీష్ హష్మీ ( Tabish Hashmi) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. రంజాన్ మాసం ( Ramadan festival season ) ఇప్పటికే ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పాకిస్తాన్ గెలవబోతుందని వ్యాఖ్యానించాడు. 1992, 2017 లో కూడా రంజాన్ మాసాలు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ చాంపియన్ అయిందని గుర్తు చేశాడు.

ఇప్పుడు కూడా అదే హిస్ట‌రీ రిపీట్ కానుంద‌ని వెల్ల‌డించారు. దీంతో తబీష్ హష్మీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. అయితే, తబీష్ హష్మీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ర‌షీద్ ల‌తీఫ్ ( Rashid Latif) కౌంట‌ర్ ఇచ్చారు. రంజాన్ సెంటీమెంట్ కాదు, ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా పాకిస్తాన్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వబోద‌ని చుర‌క‌లు అంటించారు. పాకిస్తాన్ ప్లేయ‌ర్లు స‌రిగ్గా ఆడ‌టం లేదు, అలాంట‌ప్పుడు అల్లాహ్ వ‌చ్చినా కాపాడ‌లేడ‌ని కౌంట‌ర్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కసితో ఆడితేనే, టి20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ గెలుస్తామ‌ని ర‌షీద్ ల‌తీఫ్ వెల్ల‌డించారు.

Advertisement

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా పాకిస్తాన్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌దు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇవాల్టి నుంచి సూపర్ 8 ఫైట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఇవాళ ఆడనుంది. కొలంబో ప్రేమ దాస‌ స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సూపర్ 8 మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ టీవీ డిబేట్ లలో కొత్త చర్చ మొదలైంది. ఆ అల్లాహ్ అండదండలతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ను పాకిస్తాన్ గెలుచుకోబోతుందని.. చాంపియన్ అవుతుందని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ హోస్ట్ తబీష్ హష్మీ ( Tabish Hashmi) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో ఈసారి కచ్చితంగా అల్లాహ్‌ పాకిస్తాన్ కోరిక తీర్చబోతున్నాడని వెల్లడించారు. తాజాగా తబీష్ హష్మీ ఆధ్వర్యంలో టీవీ డిబేట్ నడిచింది. ఇందులో తబీష్ హష్మీ హోస్ట్ గా వ్యవహరించగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్, ర‌షీద్ లతీఫ్, లాంటి ప్రముఖులు ఉన్నారు.

Advertisement

ఈ సందర్భంగా తబీష్ హష్మీ మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో కచ్చితంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని పాకిస్తాన్ గెలవబోతుందని వెల్లడించారు. 1992 సంవత్సరంలో కూడా రంజాన్ మాసం వచ్చింది. ఆ సమయంలో వరల్డ్ కప్ పాకిస్తాన్ గెల్చుకుందని గుర్తు చేశాడు. 2017 సంవత్సరంలో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రంజాన్ మాసం వచ్చినట్లు తెలిపాడు తబీష్. ఈ రెండు సమయాల్లో కూడా పాకిస్తాన్ కు అండగా అల్లాహ్‌ నిలిచాడని.. తద్వారా ఛాంపియన్ కూడా అయిందని స్పష్టం చేశాడు. ఈసారి కూడా రంజాన్ వచ్చింది కాబట్టి టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పాకిస్తాన్ గెలవబోతుందని ప్రకటించాడు. అయితే దీనికి రషీద్ లతీఫ్ కౌంటర్ ఇచ్చాడు. అల్లాహ్ అండగా ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ ప్లేయర్లు కచ్చితంగా ఆడాలని.. అప్పుడే ఛాంపియన్ అవుతుందని చురకలు అంటించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్లేయర్లు చెత్తగా ఆడుతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆ డిబేట్ లో ఉన్న మిగిలిన మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు పగలబడి నవ్వేశారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×