E-Paper
Advertisement

Vishnu Vinyasam: విడుదలకు ముందే లాభాల దిశగా విష్ణు విన్యాసం.. బడ్జెట్ ఎంత? లాభం ఎన్ని కోట్లు?

Vishnu Vinyasam: విడుదలకు ముందే లాభాల దిశగా విష్ణు విన్యాసం.. బడ్జెట్ ఎంత? లాభం ఎన్ని కోట్లు?
Advertisement

Vishnu Vinyasam: తెలుగు చిత్ర పరిశ్రమలో వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు శ్రీ విష్ణు. ఒకవైపు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు కామెడీతో ఆకట్టుకుంటున్న ఈయన కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారుప్రస్తుతం ఆయన విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ అనే రెండు చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలను ఒకేరోజు విడుదల చేయాలనుకున్నా.. కొన్ని పరిస్థితుల కారణంగా రెండు చిత్రాల విడుదల తేదీలను మార్చేశారు.

రిలీజ్ డేట్ మార్చుకున్న విష్ణు విన్యాసం..

ఇకపోతే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న మృత్యుంజయ్ చిత్రాన్ని మొదట ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాని ఇప్పుడు మార్చి 6వ తేదీకి మారుస్తూ ఫిబ్రవరి 20వ తేదీన అధికారికంగా అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు శ్రీ విష్ణు నటిస్తున్న మరో చిత్రం విష్ణు విన్యాసం. ఈ సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

విడుదలకు ముందే లాభాల బాట పట్టిన విష్ణు విన్యాసం..

Advertisement

ఇదిలా ఉండగా విష్ణు విన్యాసం సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయంలోకి వెళ్తే.. విష్ణు విన్యాసం మూవీని దాదాపు 19 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేశారు. అందులో థియేటట్రికల్ హక్కుల ద్వారా 10 కోట్లు, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 16 కోట్లు.. మొత్తంగా 26 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది . దీంతో ఈ సినిమా విడుదలకు ముందే సుమారుగా 7 కోట్ల రూపాయల లాభాలను అందుకొని నిర్మాతలకు లాభాలను తీసుకువచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే రిలీజ్ కి ముందే ఈ సినిమా సేఫ్ కావడం.. ఒకవేళ ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే అటు నిర్మాతకు మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు . విడుదలకు ముందే లాభాలను అందిస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకున్నారు శ్రీ విష్ణు . మరి థియేటర్లలోకి ఈ సినిమా వచ్చాక ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ:Karate Kalyani – Anvesh: అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులా? కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు!

సేఫ్ జోన్లోకి వెళ్లిపోయిన నిర్మాత.

Advertisement

యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ డ్రామాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ మంచి ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే విష్ణు విన్యాసం సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధమైపోయారు ఈ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు. అటు నయన్ సారిక కూడా తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై జి సుమంత్ నాయుడు నిర్మించారు. మొత్తానికి అయితే శ్రీ విష్ణు పై నమ్మకంతోనే ఈ సినిమా తీసిన ఆయనకు విడుదలకు ముందే లాభాలు వచ్చేసాయని చెప్పవచ్చు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×