E-Paper
Advertisement

IPL Logo: ముస్తాఫిజుర్ రహమాన్ ఎఫెక్ట్‌..ఐపీఎల్ లోగోలో భారీ మార్పులు ?

IPL Logo: ముస్తాఫిజుర్ రహమాన్ ఎఫెక్ట్‌..ఐపీఎల్ లోగోలో భారీ మార్పులు ?
Advertisement

IPL Logo:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముస్తాఫిజుర్ రహమాన్ ను ఆడించకపోవడంపై దుమారం రేగుతోంది. నిన్నటి వరకు ఈ టోర్నమెంట్ లో ముస్తాఫిజుర్ రహమాన్ ఆడుతాడని చర్చ జరిగింది. కానీ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ముస్తాఫిజుర్ రహమాన్ ను ఆడించకుండా ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్ గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఐపిఎల్ లోగోలో మార్పులు తీసుకువచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

ఐపీఎల్ లోగోలో మార్పులు.. బంగ్లాదేశ్ కారణంగానే?

Advertisement

ముస్తాఫిజుర్ రహమాన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో భారీ మార్పులు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి పైన ఉన్న ఫోటో తరహాలో లోగో ఉంటుంది. ఈ లోగో ఒక ఆటగాడు బ్యాటింగ్ చేస్తున్న తరహాలో ఉంటుంది. అయితే ఈ లోగో బంగ్లాదేశ్ ప్లేయర్ ను ఉద్దేశించి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఏబీ డివిలియర్స్ ఆడే షాట్ అంటున్నారు. మరి కొంతమంది బంగ్లాదేశ్ ఆటగాడి బ్యాటింగ్ స్టైల్ ను లోగో లాగా తయారుచేసి ఐపీఎల్ కోసం వాడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ లోగోను తొలగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట. ఆ లోగో స్థానంలో మరొకటి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముస్తాఫిజుర్ రహమాన్ ఎపిసోడ్.. బంగ్లా సంచలన నిర్ణయం

ముస్తాఫిజుర్ రహమాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడించకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలిపై చాలా గుర్రుగా ఉంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. ఇందులో భాగంగానే ఐసీసీకి తాజాగా లేఖ కూడా రాసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో తమ జట్టు పర్యటించబోదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాజాగా వెల్లడించింది. ఇండియాలో కాకుండా శ్రీలంకలో తమ మ్యాచ్ లు నిర్వహించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది బంగ్లా క్రికెట్ బోర్డు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని కూడా వార్నింగ్ ఇస్తోంది. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ కు ఇండియా తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇస్తోంది.

Advertisement

 

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×