E-Paper
Advertisement

Morocco in quarter finals : స్పెయిన్‌ ఔట్‌.. క్వార్టర్స్‌లో మొరాకో..

Morocco in quarter finals : స్పెయిన్‌ ఔట్‌.. క్వార్టర్స్‌లో మొరాకో..
Advertisement

Morocco in quarter finals : ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో సంచలనం. అది కూడా నాకౌట్ దశలో. మేటి జట్టు అయిన స్పెయిన్… పసికూన మొరాకో చేతిలో చిత్తై… టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎప్పుడో 36 ఏళ్ల కిందట ఒకసారి ప్రీక్వార్టర్స్ ఆడిన చరిత్ర ఉన్న మొరాకో… మాజీ ఛాంపియన్ స్పెయిన్‌కు షాకిచ్చి… ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

కేవలం ఆరోసారి మాత్రమే ప్రపంచకప్‌ ఆడుతున్న మొరాకో… అంచనాలకు మించిన ఆటతీరుతో స్పెయిన్‌కు కళ్లెం వేసింది. 120 నిమిషాల పాటు స్పెయిన్‌ గోల్‌ చేయకుండా అడ్డుకోవడమే కాకుండా… పెనాల్టీ షూటౌట్లో 3-0 గోల్స్ తేడాతో ఆ జట్టును ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాచ్‌ మొత్తం మీద 75 శాతం బంతి స్పెయిన్‌ చేతిలోనే ఉన్నా… మొరాకోతో పోలిస్తే ఆ జట్టు ఆటగాళ్లు మూడు రెట్లకు పైగా పాస్‌లు అందించుకున్నా… ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయారు. నిర్ణీత 90 నిమిషాలతో పాటు, ఇంజురీ టైం, అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. దాంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పనిసరి అయింది.

Advertisement

అయితే షూటౌట్లలో స్పెయిన్‌కు సరైన రికార్డు లేకపోవడంతో ఆ దేశ అభిమానులు ఆందోళన పడ్డారు. ఆ ఒత్తిడి ఆటగాళ్లపైనా పడింది. మొరాకో ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో షూటౌట్‌ను ఎదుర్కొంటే.. స్పెయిన్‌ ఆటగాళ్లు మాత్రం భయం భయంగా షాట్లు ఆడి జట్టు కొంప ముంచారు. నాలుగు ప్రయత్నాల్లో మొరాకో మూడు గోల్స్ కొట్టగా… స్పెయిన్ వరుసగా మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. దాంతో 3-0 గోల్స్ తేడాతో అనూహ్య విజయం సాధించింది… మొరాకో. ఆ జట్టు గోల్‌కీపర్‌ యాసిన్‌ బౌనౌ తన కెరీర్లోనే అద్భుతంగా ఆడి, స్పెయిన్ గోల్స్ అడ్డుకుని… అభిమానులకు హీరోగా మారాడు. స్పెయిన్‌ కొట్టిన మూడు షాట్లలో అతనే రెండు అడ్డుకున్నాడు. ఎప్పుడో 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లీ ఈ వరల్డ్‌కప్‌లో మొరాకో నాకౌట్ మ్యాచ్ ఆడుతున్నందుకే ఆ దేశ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్పెయిన్‌పై గెలిచి మొరాకో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టడంతో… ఆ దేశ అభిమానుల ఆనందం పట్టలేకుండా ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×