E-Paper
Advertisement

Mohammed Shami : షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా? వైరల్ అవుతున్న ఫోటో..!

Mohammed Shami : షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా? వైరల్ అవుతున్న ఫోటో..!
Advertisement

Mohammed Shami : ఎప్పుడు ఎవరి మూడ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలం.. ప్రస్తుతం మహ్మద్ షమీ అయితే సోషల్ మీడియాలో యమా స్పీడుగా ఉన్నాడు. మొన్ననే తను ఫిట్ గా ఉన్నట్టుగా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందరూ బౌలింగ్ చేస్తున్న ఫొటోలేమో అనుకుంటే, తీరా అవన్నీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నవి కనిపించాయి. ఇదేంటయ్యా? ఇలా ఉన్నాయి. కొంపదీసి బౌలింగ్ వదిలేశావా భయ్యా ? అని నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు.

కానీ చివరికి నెట్ లో తను బ్యాటింగ్ ప్రాక్టీస్  చేస్తున్నట్టు అనుకున్నారు. అలాగే తాజాగా మరొక ఫొటో పెట్టి, నెట్టింట అందరికీ పని చెప్పాడు. ఇంతకీ ఏమిటయ్యా అంటే, తను పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి పెట్టి, అందరికీ లేనిపోని క్యూరియాసిటీ కల్పించాడు. పోనీ ఏమైనా చెప్పాడా అంటే అదేం లేదు.

Advertisement

‘మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని దాని కింద క్యాప్షన్ ఇచ్చాడు. అందరూ ఆదరిస్తున్నందుకు, ఈ పెళ్లి ఫొటోకి అసలు సంబంధం ఏమిటా? అని నెటిజన్లు  బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. 2023  వన్డే ప్రపంచకప్ లో షమీ అద్భుతంగా ఆడుతున్నప్పుడు విడిపోయిన భార్య హసీన్ జహాన్ అతన్ని మానసికంగా  హింస పెడుతూ కొన్ని వీడియోలు పెట్టింది. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. ఇప్పుడెక్కడుందో కూడా తెలీదు..

ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏమీ లేకుండా పెళ్లి కొడుకు గెటప్ తో కనిపించడం ఏమిటి? అని నెట్టింట తెగ డిస్కర్షన్ మొదలైంది. అయితే పలువురు పెళ్లి కొడుకు గెటప్ బాగుందని మెచ్చుకున్నారు. కొందరేమో మళ్లీ పెళ్లిగానీ చేసుకుంటున్నావా? భయ్యా. అని రాశారు. కొందరేమో  ‘కొత్త లుక్ బాగుంది. ఇంతకీ విషయం ఏమిటి’ అని ఎవరికి వారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కొందరు కుదురుండరు కదా… ఈ పెళ్లికొడుకు గెటప్ పై ఆరా తీస్తే, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి  స్పందనా లేదు. అలాగే భరణం తీసుకుంటున్న భార్య హసీన్ నుంచి కూడా ఎటువంటి విమర్శలు రాలేదు. మరి ఎవరిని ఉద్దేశించి ఈ ఫొటో పెట్టాడు, దానికింద ఎందుకు ధన్యవాదాలు పెట్టాడని నెటిజన్లు మదనపడుతున్నారు.

Advertisement

అయితే ఇటీవల షమీ అర్జున అవార్డు అందుకున్నాడు. అదిప్పుడు గుర్తొచ్చి పెళ్లికొడుకు గెటప్ లో ధన్యవాదాలుగానీ తెలిపాడా? అని కొందరు అంటున్నారు.  లేదంటే ప్రజలకి త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్టు హింట్ ఏమైనా ఇచ్చాడా? అని కూడా అనుకుంటున్నారు. ఏం జరిగినా మహ్మద్ షమీ ఆ పెళ్లి ఫొటో ఎందుకు పెట్టాడో క్లారిటీ ఇవ్వకపోతే, ఈ రచ్చ నెట్టింట నడుస్తూనే ఉంటుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×