E-Paper
Advertisement

Sperm : చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు..! ఎలానో తెలిస్తే..!

Sperm : చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించొచ్చా..? అవును ఆ వీర్యంతో ఆరోగ్యంగా ఉండే పిల్లలను పుట్టించొచ్చు అని అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ప్రకారం.. మనిషి చనిపోయిన 48 గంటల వరకూ అతడి స్పెర్మ్‌ను గర్భధారణ కోసం వినియోగించవచ్చు.

Sperm : చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు..! ఎలానో తెలిస్తే..!
Advertisement

Sperm : చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించొచ్చా..? అవును ఆ వీర్యంతో ఆరోగ్యంగా ఉండే పిల్లలను పుట్టించొచ్చు అని అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ప్రకారం.. మనిషి చనిపోయిన 48 గంటల వరకూ అతడి స్పెర్మ్‌ను గర్భధారణ కోసం వినియోగించవచ్చు.

మనిషి చనిపోయాక అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంక్‌లో నిల్వ చేయవచ్చు. ఈ పద్దతిని నైతికంగా స్వీకరించాలి. ఇలా చేయడం వలన స్పెర్మ్ బ్యాంక్‌లో నిల్వ చేసే శుక్రకణాల సంఖ్యను పెంచవచ్చని అంటున్నారు. పురుషులు చనిపోయిన తర్వాత వారి వీర్యాన్ని దానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

Advertisement

స్పెర్మ్ డొనేషన్‌కు సంబంధించి చాలా దేశాల్లో కఠిన చట్టాలు ఉండటం వల్ల స్పెర్మ్ బ్యాంకుల్లో శుక్రకణాల నిల్వ తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. స్పెర్మ్ డొనేషన్ అనేది అవయదానంలా భావించాలని చెబుతున్నారు. స్పెర్మ్ దానం చేయడం వలన పిల్లలు కలగని కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

వ్యక్తి చనిపోయిన 48 గంటల్లొపు రెండు పద్ధతుల ద్వారా వీర్యాన్ని తీయొచ్చని అంటున్నారు. ప్రొస్టేట్ గ్రంధి ఎలక్ట్రికల్ సిమ్యూలేషన్ ద్వారా లేదా సర్జరీ ద్వారా మరణించి వ్యక్తి నుంచి శుక్రకణాలు తీయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

అయితే చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ సేకరించే క్రమంలో కొన్ని చిక్కుముడులు కూడా ఉన్నాయి. డోనర్ కన్సెంట్ ఉండదు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవొచ్చు. డోనర్ వివరాలు గోప్యతగా ఉంచడం ఇక్కడ ప్రధాన విషయం. కుటుంబ వృద్ధి కోసం కాకుండా.. స్పెర్మ్ డొనేషన్‌ను అవయదానంలా భావిస్తే.. చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చని అభిప్రాయ పడుతున్నారు శాస్త్రవేత్తలు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×