E-Paper
Advertisement

కోహ్లీ గ్రేట్ ప్లేయ‌ర్‌…పాకిస్తాన్ గెలుపును ప్ర‌తీసారి కోహ్లీనే అడ్డుకున్నాడు

కోహ్లీ గ్రేట్ ప్లేయ‌ర్‌…పాకిస్తాన్ గెలుపును ప్ర‌తీసారి కోహ్లీనే అడ్డుకున్నాడు
Advertisement

Mohammad Amir On Kohli: విరాట్ కోహ్లీ ( Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటి చేత్తో ఎలాంటి మ్యాచ్ అయినా సరే గెలిపించే సత్తా ఉన్న మొనగాడు. ముఖ్యంగా టీమిండియా చేజింగ్ చేసే సమయంలో విరాట్ కోహ్లీ బరిలో దిగితే.. ప్రత్యర్థి జట్టుకు నరకం కనపడాల్సిందే. పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై అయితే, విరాట్ కోహ్లీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం మరి కష్టం. అలాంటి విరాట్ కోహ్లీ పైన తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir) కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ ఉండని రోజులు టీమిండియా పై పాకిస్తాన్ గెలవడం కష్టమేడని బాంబు పేల్చారు. ఇప్పటివరకు టీమిండియాను చాలా సార్లు ఓడించే ప్రయత్నం పాకిస్తాన్ చేసిందని… ఆ సమయంలో ప్రతిసారి విరాట్ కోహ్లీనే అడ్డుకున్నాడని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అందుకే విరాట్ కోహ్లీ ఛేజింగ్ మాస్ట‌ర్ అనే పేరు వ‌చ్చింద‌ని కొనియాడారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

కోహ్లీ గ్రేట్ ప్లేయ‌ర్‌…పాకిస్తాన్ గెలుపును ప్ర‌తీసారి కోహ్లీనే అడ్డుకున్నాడు

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ( Virat Kohli) పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammed Amir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఈ తరంలో లేడని వెల్లడించారు. అతడు వరల్డ్ క్లాసు ప్లేయర్ అని కొనియాడారు. తీవ్ర ఒత్తిడి లోను.. చేజింగ్ చేసే వీరుడు అంటూ ప్రసంశించారు. ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇండియన్ ఓడించేందుకు పాకిస్తాన్ జట్టుకు ఎన్నో అవకాశాలు వచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ఆ మ్యాచ్ లలో టీమిండియా ఒత్తిడికి గురైనప్పుడు, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగి జట్టును కాపాడేవాడు అంటూ పేర్కొన్నారు. అలా చాలా మ్యాచ్ లను విరాట్ కోహ్లీ గెలిపించినట్లు వివరించారు. ఒంటి చేత్తో పాకిస్తాన్ ఓడించాడని గుర్తు చేశారు.

మెల్ బోర్న్ ఇన్నింగ్స్.. పాకిస్తాన్ కు పీడకలే

2022 t20 ప్రపంచ కప్ సందర్భంగా మేల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా విజయం సాధించింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ 82 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. అప్పుడు విరాట్ కోహ్లీ చేసిన బ్యాటింగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైనదని పేర్కొన్నారు. ఆ ఒక్క మ్యాచ్ తో హారిస్ రౌఫ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్లు ఇప్పటికీ కళ్ళల్లో తిరుగుతున్నాయని వెల్లడించారు. అలాంటి ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తేనే… పాకిస్తాన్ విజయాలకు ఓ మార్గం దొరుకుతుందని వెల్లడించారు. విరాట్ కోహ్లీ వెళ్ళిపోతే, అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమన్నారు. అతడు టి20 లేకపోవడం కారణంగానే ఈమధ్య ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ లలో టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశారు.

Advertisement

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×