E-Paper
Advertisement

పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం
Advertisement

Mike Hesson on Pakistan not winning the ICC events:  పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో (2026 T20 World Cup tournament) గ్రూప్ దశలోనే నిష్క్రమించింది పాకిస్తాన్. అంతేకాదు టీమిండియా చేతిలో ఆసియా కప్, టి20 ప్రపంచ కప్ టోర్నమెంటులో చిత్తు చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే అలాంటి పాకిస్తాన్ క్రికెట్ జట్టు మెరుగుపడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మైక్ హెస్సన్ (Mike Hesson). పాకిస్తాన్ క్రికెట్ జట్టు సక్సెస్ రేట్ 20 నుంచి 70 శాతానికి పెంచామని…ఇకపై తమ జట్టు అద్భుతంగా రాణిస్తుందని వ్యాఖ్యానించారు. ఐసీసీ టోర్నమెంట్స్ లో టీమిండియా కూడా ఓడించగల శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్తాన్ జట్టు కోచ్ మైక్ హెస్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఐసీసీ టోర్నమెంట్ లో మెరుగ్గా రాణించడం లేదన్న సంగతి తెలిసిందే. మొన్న టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో పురుషుల పాకిస్తాన్… గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయింది. ఇక లేటెస్ట్ గా ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో కూడా పాకిస్తాన్ మహిళల జట్టుకు అదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పురుషుల హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టు గతంలో అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉండేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే మొన్న ఆస్ట్రేలియా పై కూడా రెండు సిరీస్ లు గెలిచినట్లు గుర్తు చేశారు. వరుసగా సిరీస్ లు గెలవడంపై ఫోకస్ చేసినట్లు స్పష్టం చేశారు. గతంలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగితే పాకిస్తాన్ సక్సెస్ రేట్ కేవలం 20 శాతం ఉండేదని వెల్లడించారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి అమాంతం పెరిగిపోయిందని బాంబు పేల్చారు. ఆ పర్సంటేజ్ మరింత పెంచుతామని వివరించారు. ఈ క్రమంలో 2027 వన్డే ప్రపంచ టోర్నమెంట్లో టీమిండియా పైన కూడా పాకిస్తాన్ అవలీలగా గెలుస్తుందని హెచ్చరించారు.

Advertisement

అంతేకాదు ఫైనల్స్ లో కూడా పాకిస్తాన్ ట్రోఫీని గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నారు. పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా… 2027 వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టును ఇప్పటినుంచి ప్రిపేర్ చేస్తోంది PCB. ఇందులో భాగంగానే తమ క్రికెటర్లు అందరినీ అమెరికాకు ట్రైనింగ్ పంపిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అక్కడ భారీ హిట్టింగ్ చేయడం ఎలా? బ్యాటింగ్ లో నైపుణ్యాలు… ఇలా అనేక రకాల లొసుగులను పాకిస్తాన్ క్రికెటర్లకు నేర్పించబోతున్నారట. బాబర్ ఆజం, ఫర్హాన్, జమాన్ , సల్మాన్ అలీ లాంటి క్రికెటర్లందరూ అమెరికాకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోబోతున్నారట.

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×