E-Paper
Advertisement

లెనిన్’తో అయ్యగారు ఈసారైనా హిట్ కొడతారా?

లెనిన్’తో అయ్యగారు ఈసారైనా హిట్ కొడతారా?
Advertisement

Akhil Lenin: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన అఖిల్ ఆ తర్వాత ‘ఏజెంట్’ లాంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సరికొత్త మేకోవర్ చూపించారు.

చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మురళీ కిశోర్ అబ్బూరు

అయితే,ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కోసం అఖిల్ ఈసారి లెనిన్ అంటూ క్రేజీ స్టోరీని ఎంచుకున్నాడు.అదే ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మంచి హిట్ చూసిన మురళీ కిశోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన మేకర్స్

Advertisement

ఈ సినిమాలో అఖిల్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది. జులై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న తరుణంలో, చిత్ర బృందం ప్రమోషన్స్ జారుని పెంచింది. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్

భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, కెమిస్ట్రీ సినిమాకు మరో ఎసెట్ .

ట్రైలర్ చూస్తె ఈ సినిమాను పూర్తి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా మలిచినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు క్లాస్, స్టైలిష్ లుక్స్లో కనిపించిన అఖిల్, ఈ సినిమాలో రాయలసీమ యాసతో, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేలా కనిపిస్తున్నారు. లవ్, ఎమోషన్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ని గట్టిగ దట్టించినట్టు అర్థమవుతుంది.ఇక భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు మరో ఎసెట్ .

ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

Advertisement

ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. “అయ్యగారు ఈసారైనా సాలిడ్ హిట్ కొడతారా?” అంటూ నెటిజన్లు అప్పుడే డిబేట్లు మొదలెట్టేశారు కూడా.చూడాలి మరి జులై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

ALSO READ:ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదం… ఇంతకీ మురుగన్ పుట్టింది ఎక్కడ ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×