E-Paper
Advertisement

LSG – South Africa : లక్నో జట్టుపై బ్యాన్? LSGని సీక్రెట్ గా దక్షిణాఫ్రికాకు పంపిస్తున్న ఓనర్ సంజీవ్…?

LSG –  South Africa : లక్నో జట్టుపై బ్యాన్? LSGని  సీక్రెట్ గా  దక్షిణాఫ్రికాకు పంపిస్తున్న ఓనర్ సంజీవ్…?
Advertisement

LSG – South Africa :  ఐపీఎల్ సీజ‌న్ వ‌చ్చేస్తుందంటే క్రికెట్ అభిమానుల‌కు ఉత్సాహం మ‌రింత రెట్టింపు అవుతుంది. సాధార‌ణంగా క్రికెట్ లో వ‌ర‌ల్డ్ క‌ప్, ఐపీఎల్ ని వీక్షించినంత‌గా మిగ‌తా మ్యాచ్ ల‌పై అంత‌గా ఆస‌క్తి క‌నిపించ‌దు. ముఖ్యంగా ఐపీఎల్ సీజ‌న్ స‌మ్మ‌ర్ లో జ‌రుగుతుంది. చాలా వ‌ర‌కు చ‌ల్ల‌ని బీరు తాగుతూ ఐపీఎల్ వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్ర‌ధానంగా చెన్నై సూప‌ర్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఇండియ‌న్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, గుజ‌రాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ వంటి జ‌ట్లు ఐపీఎల్ లో త‌ల‌ప‌డుతుంటాయి.

Also Read : Rashid Khan Bullet Proof Car : పాకిస్తానోడు ఏ క్ష‌ణ‌మైనా బాంబ్ లేస్తాడు..అందుకే ఆ కారులోనే అఫ్ఘ‌నిస్తాన్ లో తిరుగుతా!

సౌతాఫ్రికా పంపించ‌నున్న సంజీవ్ గోయెంకా

Advertisement

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, గుజ‌రాత్ టైటాన్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు ఐపీఎల్ టైటిల్స్ ని సాధించాయి. మిగ‌తా జ‌ట్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్, పంజాబ్ కింగ్స్, ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ జ‌ట్లు మాత్రం ఒక్క‌సారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.అయితే ఈసారి ఎలాగైనా ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ జ‌ట్టు ట్రోఫీ సాధించేలా ఆ జ‌ట్టు ఓన‌ర్ సంజీవ్ గోయంక స్కెచ్ వేసిన‌ట్టు స‌మాచారం. అందుకోసం స్పెష‌ల్ గా ఓ ప్లాన్ కూడా వేసిన‌ట్టు తెలుస్తోంది. అది ఏంటంటే..? లక్నో సూపర్ జాయింట్స్ జట్టును ఆ జట్టుకు సంబంధించిన ఓనర్ సంజీవ్ గోయంకా దక్షిణాఫ్రికా పంపిస్తున్నాడట. అయితే కేవలం బౌలర్లను మాత్రం పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2026 ల‌క్ష్యంగా ల‌క్నో జ‌ట్టు..?

వాస్త‌వానికి బీసీసీ రూల్ ప్రకారం.. ఐపీఎల్ ప్లేయర్లను వేరే ఏ ఇత‌ర‌ దేశాలకు కూడా పంపకూడదు. అలాగే ఐపీఎల్ లో ఆడే ప్లేయర్లు ఇతర ప్రైవేట్ లీగ్స్ లో కూడా ఆడ‌కూడ‌దు. కానీ లక్నో జట్టును సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడే ప్లేయర్లతో ప్రాక్టీస్ చేయమని పంపిస్తున్నాడట ఓన‌ర్ సంజీవ్.. ఇందుకు బీసీసీఐ పర్మిషన్ కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం బీసీసీఐ పర్మిషన్ లేకుండానే జట్టును దక్షిణాఫ్రికాకు పంపిస్తున్నాడని చెబుతున్నారు. ఏ జ‌ట్టుకు ఇవ్వ‌ని ఫ‌ర్మిష‌న్ ల‌క్నో జ‌ట్టుకు మాత్ర‌మే ఎందుకు ఇస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబ‌బంధించిన వార్త తెగ వైర‌ల్ కావ‌డం విశేషం. మ‌రో వైపు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ఎలాగైనా టైటిల్ గెలవాలని లక్నో బౌలర్లను ఇలా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీసీసీఐ అనుమ‌తి ఇస్తుందా..? అనుమ‌తి లేకుండా ల‌క్నో జ‌ట్టు ఓన‌ర్ పంపిస్తే.. ల‌క్నో జ‌ట్టు పై బ్యాన్ విధించే ప్రమాదం ఉన్నట్లు కూడా వార్త‌లు వినిపించ‌డం విశేషం. మ‌రీ ల‌క్నో జ‌ట్టు ఓన‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో వేచి చూడాలి మ‌రీ.

Advertisement

Also Read : Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ఫేవ‌రేట్ తెలుగు హీరో ఇత‌నే..”నీ అవ్వ తగ్గేదేలే” అంటూ

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×