E-Paper
Advertisement

Health benefits of Hugging: కిక్కు కోసం పెగ్గు అవసరం లేదు.. రోజుకొక హగ్గు చాలంటున్న వైద్య నిపుణులు!

Health benefits of Hugging: కిక్కు కోసం పెగ్గు అవసరం లేదు.. రోజుకొక హగ్గు చాలంటున్న వైద్య నిపుణులు!
Advertisement

Health benefits of Hugging: ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు.. చాలామంది ఏదో ఒక పనితో బిజీగా గడిపేస్తుంటారు. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసుకు తక్షణ సాంత్వన కావాలంటే.. ఏదో ఒక మార్గం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి మందులు, పైసా ఖర్చు లేకుండా మీ మూడ్‌ను వెంటనే మార్చే ఔషధమే ‘హగ్’.

మీ ప్రియమైన వారిని ఆప్యాయంగా ‘హగ్’ చేసుకునే క్షణంలో మన శరీరం ఆక్సిటోసిన్‌ను విడుదల చేసి, ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తుంది. ఫలితంగా మనసు, మైండ్ వెంటనే రిలాక్స్ అయిపోతుంది. హగ్ చేసుకోవడం అనేది భావోద్వేగమైన చర్య మాత్రమే కాదు.. దీనివల్ల గుండె ఆరోగ్యం, అధిర రక్తపోటు నియంత్రణ, నిద్ర మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తికి కూడా బలం చేకూరుతుంది. కౌగిలింత చిన్నదే అయినా.. దీనివల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయంటున్న నిపుణులు.

పవర్‌ఫుల్ థెరపీ:

Advertisement

ఆత్మీయులను కౌగిలించుకోవడం అనేది చిన్న విషయంగా అనిపించినా.. దాని ప్రభావం మాత్రం మన మానసిక, శారీరక ఆరోగ్యాలపై చాలా లోతుగా పనిచేస్తుంది. హగ్ అనేది కేవలం ప్రేమను చూపించే చర్య మాత్రమే కాదు.. శరీరం, మనసును సహజంగా బ్యాలెన్స్ చేసే ఓ పవర్‌ఫుల్ థెరపీ.

Also Read: శరీరంలో నీరు తగ్గితే ఈ ప్రమాదాలు తప్పవు.. రోజుకు ఎంత నీరు తాగాలో తెలుసా?

హగ్‌తో మానసిక లాభాలు:

Advertisement

కౌగిలించుకునే సమయంలో శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. అదే సమయంలో ‘లవ్ హార్మోన్’గా పిలిచే ఆక్సిటోసిన్ విడుదల పెరిగి.. ఆనందం, ప్రేమ, భద్రతా భావన బలపడతాయి. అలాగే ఒంటరితనం, భయాలు తగ్గి మానసిక స్థితి పాజిటివ్‌గా మారడంలో హగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

శారీరక ఆరోగ్యంపై ప్రభావం:

ఈ హగ్.. గుండె వేగం తగ్గి, రక్తపోటు నియంత్రణలోకి తేవడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరి సాధారణ జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి తీవ్రత కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. దీంతోపాటు మనసు రిలాక్స్ కావడంతో గాఢమైన నిద్రలోకి జారుకునే అవకాశం కూడా పెరుగుతుంది.

ఎంతసేపు హగ్ చేసుకోవాలి?

కౌగిలింత యొక్క పూర్తి ప్రయోజనం పొందాలంటే కనీసం 20 సెకన్ల పాటు మీ ప్రియమైన వారిని ఆప్యాయంగా కౌగిలించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆక్సిటోసిన్ సరైన మోతాదులో విడుదల అవుతుంది. రోజూ 8 నుంచి 12 సార్లు హగ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే.. మానసికంగా, శారీరకంగా మంచి మార్పు కనిపిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Also Read: అరికెలు తినకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలను వదులుకునట్టే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×