E-Paper
Advertisement

Lalit Modi: రాసి పెట్టుకోండి…ఐపీఎల్ 2030 నాటికి వైభ‌వ్ రూ.150 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

Lalit Modi: రాసి పెట్టుకోండి…ఐపీఎల్ 2030 నాటికి వైభ‌వ్ రూ.150 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా
Advertisement

Lalit Modi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో పావులా వంతు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. మరో 75% టోర్నమెంటు జరగాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ సంచలన ప్రకటన చేశారు. 2030 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2030) సమయానికి ఒక్కో ప్లేయర్ 150 కోట్లు పలుకుతాడని అంచనా వేశారు లలిత్ మోడీ ( Lalit Modi). ప్రస్తుతం రిషబ్ పంత్ ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నట్లుగానే, భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi ) కూడా ఎక్కువగానే సంపాదిస్తాడని వెల్లడించారు. అతి త్వరలోనే ఇది జరగనుందని తెలిపారు. దీంతో లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

ఐపీఎల్ 2030 నాటికి వైభ‌వ్ రూ.150 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమై 19 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా టోర్నమెంట్ కు మాత్రం ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కరోనా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పటికీ కూడా ఐపీఎల్ టోర్నమెంట్ను పూర్తిస్థాయిలో నిర్వహించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలోనే క్రమ క్రమంగా ప్రతి సంవత్సరం ఐపిఎల్ టోర్నమెంట్ బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో ఐపీఎల్ పై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ బ్రాండ్ మరింత పెరుగుతుందని వెల్లడించారు.

అప్పుడు ఒక్క మ్యాచ్ వ్యాల్యూ 8.5 కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. అలాగే ఐపీఎల్ జట్లకు సంబంధించిన పర్స్ వ్యాల్యూ 932 కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం ఒక్కో ఐపీఎల్ ఫ్రాంచైజ్ విలువ రెండు బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపిన లలిత్ మోడీ… 2030 నాటికి ఐదు బిలియన్ డాలర్లకు చేరుతుందని స్పష్టం చేశారు. అంటే ఒక్కో జ‌ట్టు వ్యాల్యూ రూ.6000 కోట్ల వ‌ర‌కు పెరుగుతుంద‌ని చెప్పారు. అలాగే తన అంచనా ప్రకారం బాగా ఆడిన ప్లేయర్లకు ఒక్కొక్కరికి 150 కోట్ల వరకు రెండు నెలల్లోని ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వైభవ్ సూర్య వంశీ, జాకబ్ బెతెల్ లాంటి కుర్ర క్రికెటర్లు 2030 నాటికి 150 కోట్లు పలుకుతారని తెలిపారు.

ఐపీఎల్ జ‌ట్ల వ్యాల్యూ ఐదింత‌లు పెరిగే ఛాన్స్‌

Advertisement

ఇది ఇలా ఉండగా లలిత్ మోడీ చెప్పినట్లుగానే ఒక్కో జట్టు వ్యాల్యూ 2030 నాటికి భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 400 కోట్ల విలువ ఉన్న రాజస్థాన్ రాయల్స్ విలువ.. మొన్న సేల్ చేసినప్పుడు 1600 కోట్లు పలికింది. ఇదే జట్టు 2030 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వరకు ఐదింతలు పెరుగుతుందని లలిత్ మోడీ తెలిపారు. అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు వ్యాల్యూ 6000 కోట్లు దాటనుంది.

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×