E-Paper
Advertisement

కాకి మాంసం వేపుడుతో దెయ్యాలకు విందు… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న హారర్

కాకి మాంసం వేపుడుతో దెయ్యాలకు విందు… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న హారర్
Advertisement

Horror Comedy OTT : పక్కా భయపెట్టే హారర్ సినిమాలు చూసి బోర్ కొట్టిందా. అయితే ఈ హారర్ కామెడీ సినిమాను చూసేయండి. దీన్ని చూస్తున్నప్పుడు మీ నవ్వును ఆపించడం ఎవరి తరం కాదు. ఒకేసారి భయాన్ని, నవ్వుని కలిపి వడ్డిస్తుంది ఈ సినిమా. ఇది దెయ్యాలు, క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, సీరియస్ హారర్ సినిమాల్లాగా కాకుండా కామెడీగా సాగిపోతుంది. ముగ్గురు స్నేహితులు డబ్బు కోసం చేసే వెర్రి పనులు, దెయ్యాలను చూసి వాళ్లు భయపడే విధానం ప్రేక్షకులకు భలే నవ్వు తెప్పిస్తాయి. అందుకే దీన్ని ‘జాయ్‌ఫుల్ హారర్’ అని కూడా అంటారు. మీరు మరీ భయంకరమైన దెయ్యం సినిమాలను చూడలేకపోతే, ఈ సినిమా మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియా హారర్ కామెడీ సినిమా పేరు ‘పెసుగిహన్ సతే గాగక్’ (Pesugihan Sate Gagak). దీనికి డోనో ప్రదానా, ఎటియన్నే సీజర్ దర్శకత్వం వహించారు. దీనిని చాయా పిక్చర్స్ బ్యానర్‌పై ఆవురా లోవెన్సన్ చంద్ర నిర్మించారు. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం, 2025 నవంబర్ 13న థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అందుబాటులో ఉంది. ఇందులో ఆర్డిట్ ఎర్వాండా, యోనో బక్రీ, బెనిడిక్టస్ సిరేగర్, యోరికో ఏంజెలిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి IMDb లో 5.9 రేటింగ్ ఉంది. ఇది ప్యూర్ హారర్ సినిమా లాగా కాకుండా, కొంచెం భయం, కొంచెం కామెడీ కలిపి ఉంటుంది కాబట్టి 13 ఏళ్ల పైబడిన వాళ్లందరూ హ్యాపీగా చూడొచ్చు. సీరియస్ దెయ్యం సినిమాలతో బోర్ కొట్టిన వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇది టాప్ 10 సినిమాల్లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో అంతో, దిమాస్, ఇంద్రా అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. వీళ్లకి చేతిలో పైసా ఉండదు కానీ కోట్లు సంపాదించాలనే ఆశ మాత్రం గట్టిగా ఉంటుంది. అప్పుల బాధలు తట్టుకోలేక, ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఎవరో చెబితే ఒక వింత పూజ చేయడానికి రెడీ అవుతారు. ఆ పూజ ఏంటంటే.. స్మశానంలో కూర్చుని కాకి మాంసంతో చేసిన ‘సతే గాగక్’ (కాకి వేపుడు) అమ్ముతూ దయ్యాలను పిలవాలి. ఆ దయ్యాలు వచ్చి ఆ వేపుడు తిని వీళ్లకు డబ్బులు ఇస్తాయని వీళ్ల నమ్మకం. కానీ సీన్ కట్ చేస్తే, ఆ వేపుడు వాసనకి ఊరిలో ఉన్న దయ్యాలన్నీ ఒక్కసారిగా అక్కడికి క్యూ కడతాయి. వచ్చిన దయ్యాలు మామూలువి కాదు, తెగ ఆకలి మీద ఉంటాయి. అవి వేపుడు తినడమే కాకుండా, ఈ ముగ్గురిని కూడా వదిలిపెట్టవు.

ఒక్క పూజతో కోటీశ్వరులు అయిపోదాం అనుకున్న వీళ్లు, ఆ దయ్యాల బారి నుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని పరుగులు పెడుతుంటారు. ఆ భయంలో కూడా వీళ్లు చేసే కామెడీ, పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చివరికి ఆ దయ్యాల గోల ఎక్కువైపోయి, పరిస్థితి చేజారిపోతుంది. డబ్బు పిచ్చితో మొదలుపెట్టిన ఈ ఆట, చావు దాకా వెళ్తుంది. ఆ దయ్యాల నుంచి వీళ్లు బయటపడ్డారా? లేక ఆ డబ్బు ఆశలోనే ఆవిరైపోయారా? అన్నదే మిగతా కథ.

Advertisement

Read Also : కోట్లు కొల్లగొట్టే ప్లాన్.. నవ్విస్తూనే గజగజ వణికించే యాక్షన్… మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×