E-Paper
Advertisement

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ వ‌దులుకోవ‌ద్దు

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ వ‌దులుకోవ‌ద్దు
Advertisement

Kevin Pietersen:  ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (India tour of England, 2026) మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… తన పరువు నిలబెట్టుకునేందుకు, సిద్ధమైంది. ఎలాగైనా ఇంగ్లాండ్ పై గెలవాలన్న కసితో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియాను మరింత ఒత్తిడిలోకి నెట్టి వేసేందుకు ఇంగ్లాండు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇలాంటి క్రమంలో టీమిండియాకు డేంజర్ బెల్స్ పంపించాడు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen). టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు..? వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ ఇంగ్లాండ్ వ‌దులుకోవ‌ద్దు అంటూ కెవీన్ పీట‌ర్స‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో కెవీన్ పీట‌ర్స‌న్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో డేంజర్ బెల్స్ పంపించాడు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. టీమిండియాను వైట్ వాష్ చేసే సమయం ఆసన్నమైందని.. ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇండియన్ ఓడించలేమని ఇంగ్లాండుకు సూచనలు చేశారు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్న ప్లేయర్లు గందరగోళంలో ఉన్నారని.. ఇలాంటి క్రమంలో వాళ్లను ఓడించడం చాలా సులభం అవుతుందన్నారు. దానికి తోడు ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయి ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తు చేశారు.

దానిని ఆసరాగా చేసుకొని టీమిండియాను దెబ్బ కొట్టాలని తమ ఇంగ్లాండ్ జట్టుకు సూచనలు చేశారు కెవిన్ పీటర్సన్. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్లను త్వరగా పడగొడితే టీమిండియా మొత్తం ప్యాకప్ అవుతుందని చురకలు అంటించారు. అటు హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ ఇద్దరినీ ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ కసరత్తులు చేయాలని కోరారు. ఇలా అన్ని వైపుల టీమిండియాను దెబ్బ కొడితే… వైట్ వాష్ చాలా సులభతరం అవుతుందన్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని… ఐపీఎల్ లో ఆడిన ఆట తీరును ఇక్కడ కనబరచడం కష్టమేనన్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియాను గట్టి దెబ్బ కొట్టాలని సూచనలు చేశారు. దీంతో ఇండియా పై కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇంగ్లాండు పై టీమ్ ఇండియాకు అద్భుతమైన రికార్డు

Advertisement

టి20 ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పై టీం ఇండియాకు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా ఇంగ్లాండ్ పై టీమిండి ఆదిపత్యం చెలాయిస్తోంది. 2017 నుంచి ఇప్పటివరకు ఐదు టి20 సిరీస్ లు ఈ రెండు జట్ల మధ్య జరిగాయి. ఇందులో అన్నిటినీ ఇండియా గెలుచుకుంది. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్లో పర్యటించిన ఇండియా…2-1 తేడాతో టి20 సిరీస్ కైవసం చేసుకుంది. మరి ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా… ఇంగ్లాండు పై ఎలా రాణిస్తుందో చూడాలి.

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×