E-Paper
Advertisement

నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!

నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!
Advertisement

Mega Family:మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వంలో వరుసగా కీలకమైన పదవులు దక్కుతున్నాయి. మొన్నటికి మొన్న చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెలకు రాష్ట్ర క్రీడా రంగంలో అగ్ర స్థానం కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా చిరంజీవి భార్య సురేఖ కొణిదెలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డులో చోటు కల్పించింది. ఇలా మెగా ఫ్యామిలీకి బ్యాక్ టు బ్యాక్ అధికారిక పదవులు దక్కడం ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

యాదగిరి గుట్ట నూతన బోర్డు ప్రకటన:

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సరికొత్త బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నూతన బోర్డుకు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. బోర్డులో చైర్మన్‌తో పాటు సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ కలిపి మొత్తం 18 మందికి ఈ ప్రతిష్టాత్మక బోర్డులో చోటు దక్కింది.

మెంబర్‌గా సురేఖ కొణిదెలకు చోటు:

Advertisement

యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు సభ్యుల జాబితాలో మెగాస్టార్ భార్య సురేఖ కొణిదెల పేరు ఉండడం విశేషం. ఆమెతో పాటు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, చిలప్పగారి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఏం రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్ సభ్యులుగా ఉన్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్ వంటి కీలక అధికారులు ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.

నాడు కోడలు ఉపాసనకు స్పోర్ట్స్ హబ్ బాధ్యతలు:

మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పదవి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చిరంజీవి కోడలు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్రంలో క్రీడలను డెవలప్ చేయడానికి ఏర్పాటైన ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’కు ఆమెను కో- ఛైర్మన్‌గా నియమించారు. ప్రముఖ బిజినెస్‌మెన్ సంజీవ్ గోయెంకా దీనికి ఛైర్మన్‌గా ఉన్నారు.

Advertisement

also read:5 మంది హీరోయిన్స్ తో టాక్సిక్ నుండి అదిరిపోయే వీడియో రిలీజ్.. యశ్ లుక్స్ చూసారా?

గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా హైదరాబాద్:

తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి క్రీడా నగరంగా తీర్చిదిద్దడం, అథ్లెట్ల సంక్షేమం చూసుకోవడమే లక్ష్యంగా ఉపాసన ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ హబ్ బోర్డు పనిచేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడుతూ తెలంగాణను క్రీడల్లో నెంబర్ వన్ చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఉపాసన ఆ మధ్య ప్రకటించారు. ఇక ఇప్పుడు అత్తగారికి కూడా గుడి బోర్డులో పదవి రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

నాడు కోడలు ఉపాసనకు క్రీడా రంగంలో ప్రాధాన్యత, నేడు అత్త సురేఖకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డులో సభ్యత్వం.. ఇలా మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం చూస్తుంటే చిరంజీవి ఫ్యామిలీతో ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇక ఈ నూతన పదవులతో మెగా మహిళలు తెలంగాణ అభివృద్ధికి, ఆధ్యాత్మిక రంగానికి మరింత సేవ చేయాలని ఆశిద్దాం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×