E-Paper
Advertisement

IPL 2026: చిన్నస్వామిలో ఇక‌పై ఆ 11 సీట్లు ఖాళీనే..తొక్కిస‌లాట‌పై కర్ణాటక సంచ‌ల‌న నిర్ణ‌యం

IPL 2026: చిన్నస్వామిలో ఇక‌పై ఆ 11 సీట్లు ఖాళీనే..తొక్కిస‌లాట‌పై కర్ణాటక సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గెలిచిన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) విజయోత్సవ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానుల తాకిడి ఎక్కువై, తొక్కిసలాట ( stampede) జరిగింది. ఈ నేపథ్యంలోనే 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మరణించారు. అయితే వాళ్లకు నివాళులు ఇచ్చే క్రమంలో ఇకపై చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచాలని తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ( Karnataka State Cricket Association) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చిన్న స్వామి స్టేడియం నిర్వహణ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం.

Also Read:  MS Dhoni – Sivakarthikeyan: ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడ‌తా, రిటైర్మెంట్ పై ధోని సంచ‌ల‌నం

ఇక‌పై చిన్నస్వామిలో ఇక‌పై ఆ 11 సీట్లు ఖాళీనే

Advertisement

18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో గత సంవత్సరం చిన్నస్వామి స్టేడియం వేదికగా విజయోత్సవ వేడుకలు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం ఈ విజయోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా బెంగళూరు జట్టుకు అభిమానులు ఎక్కువ. టైటిల్ గెలిచిన ఆనందంలో ఈ విజయోత్సవ వేడుకలకు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో జనాలు వచ్చారు. దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పి, తొక్కి సలాట జరిగింది.

ఈ సందర్భంగా 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మరణించారు. మరణించిన కుటుంబాలకు విరాట్ కోహ్లీ, కర్ణాటక సర్కార్ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించింది. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన 11 మంది అభిమానులకు నివాళులు ఇచ్చే నేప‌థ్యంలో వారి స్మృతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక క్రికెట్ సంఘం వెల్లడించింది.

Advertisement

అలాగే చిన్నస్వామి స్టేడియం ఎంట్రన్స్ లో ఈ 11 మంది అభిమానుల స్మారక పలకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ నుంచే ఈ 11 సీట్లను ఖాళీగా ఉంచాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ఆదేశించింది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం వేదికగానే జరగనుంది.

 

Also Read: TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×