E-Paper
Advertisement

Iran victory over Wales : ఇరాన్ కిక్కే వేరప్పా!

Iran victory over Wales : ఇరాన్ కిక్కే వేరప్పా!
Advertisement

Iran victory over Wales : లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కేవేరప్పా. ఈ పాపులర్ సినిమా డైలాగ్ లాగే… లాస్ట్ గోల్ మనదైతే ఆ కిక్కేవేరప్పా! అని అభిమానులంతా సంబరాలు చేసుకునేలా చేసింది… ఇరాన్. ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన మ్యాచ్‌లో అదనపు సయమం ముగియబోయే ముందు రెండు సూపర్ గోల్స్ చేసిన ఇరాన్… వేల్స్‌కు షాకిచ్చింది.

ఫిఫా వరల్డ్‌కప్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇరాన్‌ అదరగొట్టింది. ప్రీక్వార్టర్ ఆశలను సజీవంగా నిలుపుకుంటూ… వేల్స్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలిచింది. తొలి అర్థభాగంలో వేల్స్‌ గోల్‌పోస్టుపై పదేపదే దాడి చేసిన ఇరాన్‌… మూడుసార్లు గోల్‌ కొట్టే అవకాశం వచ్చినా… చేజార్చుకుంది. మరోవైపు వేల్స్ కూడా గోల్ చేయలేకపోవడంతో… తొలి అర్థభాగం ఒక్క గోల్ కూడా నమోదు కాకుండానే ముగిసింది. రెండో అర్థభాగంలోనూ రెండు జట్లు గోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా… సఫలం కాలేకపోయాయి. నిర్ణీత సమయం ముగిసేలోగా రెండు జట్లు ఒక్క గోల్‌ కూడా కొట్టకపోవడంతో… అదనపు సమయం ఇచ్చారు. ఆట మరో రెండు నిమిషాల్లో ముగిసే దశకు వచ్చినా రెండు జట్టు గోల్ చేయలేకపోవడంతో… ఇక మ్యాచ్ డ్రా అవుతుందని రెండు దేశాల అభిమానులు భావించారు.

Advertisement

కానీ… ఆఖరి రెండు నిమిషాల్లో ఇరాన్ అద్భుతం చేసింది. వేల్స్‌ ఆటగాళ్ల అలసత్వాన్ని అనుకూలంగా మార్చుకున్న ఇరాన్‌… 99వ నిమిషంలో గోల్ కొట్టింది. ఆ జట్టు ఆటగాడు రూబెజ్‌ చెష్మీ ఇరాన్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే రమిన్‌ రిజెయిన్‌ కూడా గోల్‌ కొట్టడంతో ఇరాన్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు గోల్స్ ఇలా అయ్యాయో లేదో… అదనపు సమయం అలా ముగియడంతో ఇరాన్‌ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 2-6 గోల్స్ తేడాతో ఓడిన ఇరాన్… వేల్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి… నెక్ట్స్ రౌండ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్‌ డ్రా చేసుకున్న వేల్స్‌… ఇరాన్‌ చేతిలోనూ ఓడి ప్రీక్వార్టర్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×