E-Paper
Advertisement

IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు
Advertisement

IPL LED Stumps: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 ( Indian Premier League 2026 Tournament) చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 24 మ్యాచ్ లు పూర్తయ్యాయి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాప్ గేర్ లో దూసుకు వెళ్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో వాడే ఎల్ఈడీ వికెట్లపై చర్చ జరుగుతోంది. ఈ ఎల్ఈడీ వికెట్ల ( IPL LED Stumps) జతను కొనుగోలు చేయాలంటే దాదాపు 50 లక్షలు రూపాయలు ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అంటే దాదాపు నాలుగు SUV కార్లు కొనుగోలు చేయవచ్చు అన్నమాట.

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

LED స్టంప్స్ ధ‌ర ఎంత ? ఎక్క‌డ త‌యారు చేస్తారు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో LED స్టంప్స్ ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ కంపెనీ తయారు చేస్తోంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కు సంబంధించిన జింగ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ, ఈ ఎల్ఈడీ వికెట్లను తయారు చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన మెకానికల్ డిజైనర్ బ్రోంటే అకెర్మాన్ ( Bronte Eckermann) ఈ ఎల్ఈడీ స్టంప్స్ ను కనుగొన్నాడు. మామూలు చెక్క కర్రలాగా వీటిని తయారు చేయకుండా జింక్ తో రూపొందించాడు. ఈ జింక్ స్టంమ్స్ లలో మైక్రో ప్రాసెసర్, ఎల్ఈడీ లైట్స్, సెన్సార్స్, స్టంప్ కెమెరా, స్టంప్ మైక్ లాంటివి పొందుపరిచారు. వైర్ లెస్‌ ట్రాన్స్ మీట‌ర్‌ కూడా ఇందులో అమర్చబడింది. ఇందులో అమర్చిన వస్తువులన్నీ ఒకదానితో మరొకటి సంఘ‌ర్శిస్తాయి. స్టంప్స్ పై నుంచి బేల్ కింద పడిపోతే, 0.0001 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్టంమ్స్ లైట్లు వెలుగుతాయి. ఐపీఎల్ లో వాడే ఈ LED స్టంప్స్ జ‌త ధ‌ర రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. అంటే ఒక్క జ‌త ఐపీఎల్ LED స్టంప్స్ కొనుగోలు చేయాలంటే, 4 SUV కార్లు కొన‌చ్చు అంటున్నారు. అందుకే తెలివిగా బీసీసీఐ ఈ స్టంప్స్ ను అద్దెకు తెస్తుంద‌ట‌.

ఈ ఐపీఎల్ LED స్టంప్స్ ను బీసీసీఐ అద్దెకు తీసుకువ‌స్తుందా ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వాడే ఈ ఎల్ఈడీ స్టంప్స్ ధర రూ.30 లక్షలకు పైగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంటే ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కు వీటిని కొనుగోలు చేయడం చాలా ఇబ్బంది. ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ క్రమంలోనే ఈ ఎల్ఈడీ స్టంప్స్ ను అద్దెకు తీసుకువస్తుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఒక్క జత ఒక్క మ్యాచ్ కోసం వాడితే రెండు లక్షల నుంచి మూడు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో 70 మ్యాచ్ లు జరుగుతాయి. అంటే ఐపీఎల్ పూర్తయ్యే వరకు ఈ స్టంప్స్ కోసం రెండు నుంచి మూడు కోట్ల వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఖర్చు చేస్తుందన్నమాట. ఒకవేళ ఆ స్టంప్స్ బౌలర్ల ధాటికి విరిగిపోతే బీసీసీఐ నష్టం భరిస్తోంది. గతంలో అర్ష‌దీప్ సింగ్ బౌలింగ్ లో ఓ స్టంప్‌ విరిగిపోయింది. దాని ధర దాదాపు రూ. 20 లక్షలు. అయితే ఈ ఖర్చు ఎంత భారత క్రికెట్ నియంత్రణ మండలి భరించింది. దీంతో అర్షదీప్ సింగ్ కు రిలీఫ్ దక్కింది.

Advertisement

 

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

 

?igsh=MWVjMmFxdzdhNjY3dA==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×