E-Paper
Advertisement

IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్
Advertisement

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ జట్టు పైన మాత్రం గ్రాండ్ విక్టరీ అందుకుంది. కేకేఆర్ పై బౌలింగ్ అదే సమయంలో బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన SRH, 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే హైదరాబాద్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కావ్య పాపకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

65 పరుగుల తేడాతో కేకేఆర్ పై హైదరాబాద్ విజయం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో 65 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు సాధించింది. ఈ సందర్భంగా ఎనిమిది వికెట్లు నష్టపోయింది హైదరాబాద్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అలాగే కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ముగ్గురు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో జట్టు భారీ స్కోరు సాధించింది. ఇక హైదరాబాద్ విధించిన 227 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముందుగా దాటిగా ఆడింది కేకేఆర్. కానీ ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు విజృంభించారు. దీంతో 65 పరుగులు తేడాతో కేకేఆర్ పై హైదరాబాద్ విజయం సాధించింది. ముందు నుంచి హైదరాబాద్ బౌలింగ్ విభాగం చాలా వీక్ అని ప్రచారం సాగింది. అయితే ఇవాల్టి మ్యాచ్ లో మాత్రం మనోళ్లు ఇరగదీశారు. జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా ఇషాన్‌ మలింగా అలాగే నితీష్ కుమార్ రెడ్డి తలువ రెండు వికెట్లు తీశారు. హర్ష దుబే ఒక వికెట్ పడగొట్టాడు.

హైదరాబాద్ విజయం.. పాకిస్తాన్ లో సంబరాలు

ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య పాప. సన్ రైజర్స్ లీడ్స్ ఓనర్ గా వ్యవహరించిన కావ్య.. పాకిస్తానోడిని కొనేసింది. అయితే ఇది ఇండియన్ ఫాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. కానీ పాకిస్తాన్ వాళ్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు మొదటి నుంచి పాకిస్తాన్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇవాళ కేకేఆర్ పై విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్థాన్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి. కావ్య పాప టైటిల్ గెలవాలని కోరుతున్నారు అక్కడి అభిమానులు. ఇక ఇటు బంగ్లాదేశ్ లో మాత్రం కేకేఆర్ ఓడిపోయినందుకు నిరాశ చెందారు అభిమానులు. ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేసిన కేకేఆర్ ను బంగ్లాదేశ్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే కేకేఆర్ ఓడిపోతే వాళ్ళు బాధపడుతున్నారు. ఈ మేర‌కు పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×