E-Paper
Advertisement

IPL 2026-CSK: ఐపీఎల్ లో ఫిక్సింగ్‌..ర‌హ‌స్యంగా హోట‌ల్ రూంల్లోకి ఎంట్రీ..? CSK ప్లేయ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

IPL 2026-CSK: ఐపీఎల్ లో ఫిక్సింగ్‌..ర‌హ‌స్యంగా హోట‌ల్ రూంల్లోకి ఎంట్రీ..? CSK ప్లేయ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !
Advertisement

IPL 2026-CSK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ ఏడాది 19వ సీజన్ కూడా ప్రారంభించుకోనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఐపిఎల్ టోర్నమెంట్ లో ఫిక్సింగ్ జరిగినట్లు చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఈ ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టపై వేటు వేసింది బీసీసీఐ. అయితే ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై తాజాగా మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ( CSK) పార్థివ్ పటేల్ స్పందించారు. ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు ఛాన్స్ లేదని ఆయన వెల్లడించారు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

మ్యాచ్ ఫిక్సింగ్ పై చెన్నై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫిక్సింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఒక్క మ్యాచ్ కూడా ఫిక్స్ కాలేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ముందే తెలియడం అనేది అస్సలు జరగదని వ్యాఖ్యానించారు. అది సాధ్యమని నేను అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు పార్థివ్ పటేల్. మొబైల్స్ అలాగే ఈ-మెయిల్స్… హోటల్ లోకి ఎవరు వస్తున్నారు అలాగే ఎవరు వెళ్తున్నారు ఇలా అన్ని రికార్డు అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరిగే సమయంలో ప్రతి జట్టు హోటల్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారని వ్యాఖ్యానించారు. కాబట్టి ఫిక్సర్లు హోటల్ రూమ్లోకి వెళ్లడానికి అస్సలు కుదరదు… ప్లేయర్లను ఎవరు కూడా కలవడానికి కూడా ఉండదని తెలిపారు. మాటలు ఉత్తమేనని క్లారిటీ ఇచ్చేశారు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు పార్థివ్ పటేల్ (Parthiv Patel).

చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండు సంవత్సరాల బ్యాన్

ఐపీఎల్ టోర్నమెంట్లో 2013 సంవత్సరం చాలా కీలకం. ఆ సమయంలో ఫిక్సింగ్ ఆరోపణలు ( IPL fixing) తెరపైకి వచ్చాయి. అంతే కాదు రాజస్థాన్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కూడా వేటుపడింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం కారణంగా 2013లో చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ పై రెండు సంవత్సరాల నిషేధం విధించింది బీసీసీఐ. శ్రీశాంత్, అంకిత్ చావాన్, అజిత్ చండీల ఇలాంటి ప్లేయర్లు అడ్డంగా దొరికిపోయారు. ఇటు చెన్నైలోని అప్పటి ప్రిన్సిపాల్ గురునాథ్ మెయ్యప్పన్ కూడా అక్రమంగా బెట్టింగ్లో పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సహాయజమాని రాజ్ కుంద్రా కూడా బెట్టింగుకు పాల్పడి దొరికిపోయాడు. ఇలా రెండు జట్లపై అప్పుడు వేటు పడింది.

Advertisement

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×