E-Paper
Advertisement

Inzamam-ul-Haq: ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు.. బంగ్లాతో క‌లిసి బీసీసీఐ కుట్ర‌లు !

Inzamam-ul-Haq: ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు.. బంగ్లాతో క‌లిసి బీసీసీఐ కుట్ర‌లు !
Advertisement

Inzamam-ul-Haq:  ప్రపంచంలో నెంబర్ వన్ టీం అని చెప్పుకుని విర్రవీగే పాకిస్తాన్ కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఢాకా (Shere Bangla National Stadium, Dhaka) వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test, ) మధ్య శుక్రవారం తొలి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన తరుణంలో మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢాకా పిచ్‌ లో చిప్పులు పెట్టారని.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి కలిసి ఈ కుట్రలు చేసినట్లు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప‌రువు తీసేందుకు ఇలా వ్యవహరించారని బాంబు పేల్చారు. దీనిపై ఐసీసీ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇంజమామ్-ఉల్-హక్. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు – ఇంజమామ్

Advertisement

ఢాకాలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. ఏకంగా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది పాకిస్తాన్. టెస్టుల్లో బంగ్లాదేశ్ తమ సొంత గడ్డపై పాకిస్తాన్ ను ఓడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… సోషల్ మీడియా వేదికగా విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఢాకా టెస్ట్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి కుట్రలకు తెరలేపిందని బాంబు పేల్చారు.

ఢాకా పిచ్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చిప్ లు పెట్టి, దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఐదవ రోజు లంచ్ బ్రేక్ సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కుమ్మక్కై… ఈ కుట్రలకు తెరలేపినట్లు ఆరోపణలు చేశారు. అందుకే లంచ్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లు అటాకింగ్ గా ఆడ లేకపోయారని తెలిపారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరువు తీసేందుకు ఇలా కుట్రలకు తెరలేపినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజమామ్. దీనిపై కచ్చితంగా ఐసీసీ జోక్యం చేసుకొని విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాస్తానని కూడా హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 413 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 240 పరుగులు సాధించింది. అటు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు కుప్పకూలింది.

Advertisement

 

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×