E-Paper
Advertisement

India vs Zimbabwe: ఘోర ఓట‌మి, జింబాబ్వే ఎలిమినేట్‌..సెమీ ఫైన‌ల్స్ కు టీమిండియా ?

India vs Zimbabwe: ఘోర ఓట‌మి, జింబాబ్వే ఎలిమినేట్‌..సెమీ ఫైన‌ల్స్ కు టీమిండియా ?
Advertisement

India vs Zimbabwe: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) టీమిండియా మరో అద్భుతం చేసింది. అందరూ ఊహించినట్లుగానే జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసింది. సెమీ ఫైనల్ కు వెళ్లాలన్న కసితో ఆడిన టీమిండియా.. అనుకున్నది సాధించింది. జింబాబ్వేను చిత్తు చేసి, తన అడ్డంకులను తొలగించేసుకుంది టీం ఇండియా. టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( India vs Zimbabwe ) మధ్య గురువారం టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన సూపర్ 8 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai ) వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

Advertisement

అయితే ఇందులో జింబాబ్వే పై ఏకంగా 72 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి.. సెమీ ఫైనల్ దారులను క్లియర్ చేసుకుంది. అటు టీమిండియా చేతిలో ఓడిపోయిన జింబాబ్వే ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది ఈ సందర్భంగా నిర్ణీత‌ 20 ఓవర్లు ఆడింది టీం ఇండియా. దీంతో నాలుగు వికెట్లు నష్టపోయిన ఇండియా 256 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చిత్తుగా ఓడిపోయింది జింబాబ్వే. నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన జింబాబ్వే 6 వికెట్లు న‌ష్ట‌పోయి 184 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో టీమిండియా చేతిలో 72 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది జింబాబ్వే. ఈ ఓట‌మితో జింబాబ్వే టోర్న‌మెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. అటు టీమిండియా సెమీస్ అవ‌కాశాల‌ను పెంచుకుంది.

60 శాతమే సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశలో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. జింబాబ్వే జట్టును 72 పరుగుల భారీ తేడాతో ఓడించింది టీమిండియా. దీంతో 60 శాతం టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకున్నట్లే అని అంటున్నారు. అటు గ్రూప్ వన్ లో ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ కు చేరుకుంది. రెండో సెమీ ఫైనల్ స్థానం కోసం టీమిండియా, వెస్టిండీస్ పోటీ ప‌డుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్టుగానే, టీమిండియా వ‌ర్సెస్ విండీస్ జ‌ట్ల మ‌ధ్య మార్చి 1వ తేదీన మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ( Eden Gardens, Kolkata ) జ‌రుగ‌నుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు, నేరుగా సెమీ ఫైన‌ల్ కు అధికారికంగా చేర‌నుంది. ఒక వేళ వ‌ర్షం ప‌డితే, మాత్రం విండీస్ సెమీస్ కు వెళ్ల‌నుంది. జింబాబ్వే జట్టును 72 పరుగుల భారీ తేడాతో ఓడించిన‌ టీమిండియా, ఇంకా కూడా పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. ర‌న్ రేట్ -0.100 గా ఉన్న త‌రుణంలో ఈ ప‌రిస్థితి నెల‌కొంది. కానీ వెస్టిండీస్ పై విజ‌యం సాధిస్తే, సెమీస్ కు ఇండియా వెళ్ల‌నుంది.

Advertisement

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×