E-Paper
Advertisement

IND VS ENG 2nd Semi-Final: సెమీస్ కు ముందే టీమిండియాలో అల్లకల్లోలం..సంజుపై నిషేధం, అభిషేక్ పై వేటు

IND VS ENG 2nd Semi-Final: సెమీస్ కు ముందే టీమిండియాలో అల్లకల్లోలం..సంజుపై నిషేధం, అభిషేక్ పై వేటు
Advertisement

IND VS ENG 2nd Semi-Final:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సెమీ ఫైనల్ పోరు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఇటు టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచగా జరిగిపోయాయి. మ్యాచ్ ప్రారంభం కావడమే ఆలస్యం.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

అభిషేక్ శర్మ పై వేటు.. సంజు పై నిషేధం, టీమిండియా అల్లకల్లోలం

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రేపు సాయంత్రం ఏడు గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియాలో అల్లకల్లోలం జరుగుతుంది. ఇద్దరు ఓపెనర్లు జట్టుకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. సంజు శాంసన్ మొన్నటి మ్యాచ్లో 97 పరుగులు చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే. అయితే అతడు మ్యాచ్ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ కారణంగా అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించేందుకు ఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఇంగ్లాండ్ తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు సంజు దూరమవుతాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఐసీసీ ఇలాంటి ప్రకటన చేయలేదు. అటు అభిషేక్ శర్మ పైన కూడా వేటువేయాలని రవి శాస్త్రి లాంటి సీనియర్ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు.

అభిషేక్ శర్మ మైండ్ సెట్ ఏమాత్రం సరిగ్గా లేదని.. సెమీ ఫైనల్ కు అతడు సరిపోడు అని ఆయన బహిరంగం గానే విమర్శలు చేశారు. దీంతో చివరి క్షణంలో అభిషేక్ శర్మ పైన కూడా వేటు వేస్తారని ప్రచారం జోరు అందుకుంది. ఇదే జరిగితే ఇద్దరు ఓపెనర్లు సెమీఫైనల్ కు దూరం అవుతారు. ఈ నేపథ్యంలో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడు. సంజు శాంసన్ స్థానంలో ఇటీవల తండ్రిని కోల్పోయిన రింకూ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. అయితే అభిషేక్ శర్మ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించేందుకు గౌతమ్ గంభీర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వస్తే, ఓపెనర్ గా వస్తాడని అంటున్నారు. మరి దీనిపై ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

టీమిండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ జ‌ట్ల అంచ‌నా

Advertisement

టీమిండియా ప్లేయింగ్ ఎలెవ‌న్ అంచ‌నా : సంజు శాంస‌న్‌ ( కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవ‌న్ అంచ‌నా : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ బెంచ్ ఉంటార‌ని టాక్‌.

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×