E-Paper
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: సంజుకు లైఫ్ ఇచ్చిన బ్రూక్, ఆ ఒక్క క్యాచే ముంచేసింది..ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం

Ind vs Eng 2nd Semi-Final: సంజుకు లైఫ్ ఇచ్చిన బ్రూక్, ఆ ఒక్క క్యాచే ముంచేసింది..ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  సెమీ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs England 2nd Semi-Final) మధ్య కాసేపటి క్రితమే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai)  వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే టాస్ ఓడిపోయిన టీమిండియా, మొదట బ్యాటింగ్ చేసింది. అయినప్పటికీ మన టీమ్ ఇండియా బ్యాట‌ర్లు వీర విహారం చేశారు. ముఖ్యంగా సంజు శాంసన్ ( Sanju Samson) ఇరగదీశాడు. ఈ రెండో సెమీ ఫైనల్ లో 89 పరుగులతో రెచ్చిపోయాడు సంజు శాంసన్. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా భారీ స్కోరు చేసింది. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్ట‌పోయిన టీమిండియా 253 ప‌రుగులు సాధించింది. అంటే ఇంగ్లాండ్ ఫైన‌ల్ చేరాలంటే 254 ప‌రుగులు సాధించాలి.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

టీమిండియా ఊచ‌కోత‌..ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ నేపథ్యంలో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్ట‌పోయిన టీమిండియా 253 ప‌రుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఒక్కడే 89 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 39 పరుగులతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే 43 పరుగులతో ఊచ కోత కోశాడు. తిలక్ వర్మ ఏడు బంతుల్లోనే 21 పరుగులతో రెచ్చిపోయాడు. హ‌ర్ధిక్ పాండ్యా 27 ప‌రుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫైనల్స్ చేరాలంటే నిర్నిత 20 ఓవర్లలో 254 కొట్టాల్సి ఉంటుంది. అయితే టీమిండియా స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ బలంగా ఉన్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్ గెలవడం కష్టమే అంటున్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ ఈ టార్గెట్ చేదించలేకపోతే, ఇండియా ఫైనల్స్ లో అడుగుపెడుతుంది. అప్పుడు న్యూజిలాండ్ తో మార్చి 8వ తేదీన ఫైనల్ ఆడనుంది టీం ఇండియా.

 

సంజుకు లైఫ్ ఇచ్చిన బ్రూక్, ఆ ఒక్క క్యాచే ముంచేసింది

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఈ రెండో సెమీ ఫైనల్ లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ( Harry Brook ) చేసిన ఒక్క తప్పిదం కారణంగా సంజు శాంసన్ రెచ్చిపోయాడు. 15 పరుగుల వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో సింపుల్ క్యాచ్ ఇచ్చాడు సంజు శాంసన్. అయితే సర్కిల్ లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఆ క్యాచ్ అందుకోబోయి విఫలమయ్యాడు. సాధారణంగా హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఫీల్డర్. కానీ ఇంగ్లాండ్ దురదృష్టం కావచ్చు.. సంజు శాంసన్ ఇచ్చిన ఆ క్యాచ్ పట్టుకోలేకపోయాడు హ్యారీ బ్రూక్. దీంతో లైఫ్ వచ్చిన సంజు శాంసన్ ఇరగదీశాడు. 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు సంజు శాంసన్. ఈ ఒక్క సంఘటనే ఇంగ్లాండ్ కొంపముంచింది. హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలివేయడంతో ప్రతిఫలం చెల్లించుకుంది ఇంగ్లాండ్‌.

 

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×