E-Paper
Advertisement

Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!
Advertisement

Nicholas Pooran:  వెస్టిండీస్ డేంజర్ ఆటగాడు నికోలస్ పూరన్ ( Nicholas Pooran) వివాదంలో చిక్కుకున్నాడు. చేతుల దాకా వచ్చిన స్టంపింగ్ ను చేయకుండా వదిలేశాడు నికోలస్ పూరన్. దీంతో అతడు మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నమెంటులో ఈ సంఘటన జరిగింది.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌! 

నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు

Advertisement

ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నమెంట్ లో ( International League T20, 2025-26) భాగంగా తాజాగా అబుదాబి వేదికగా MI ఎమిరేట్స్ vs డెసర్ట్ వైపర్స్ ( MI Emirates vs Desert Vipers ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా డెసర్ట్ వైపర్స్ అద్భుతమైన విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ విజయం గురించి పక్కకు పెడితే, ఇందులో వికెట్ కీపర్ ముంబై ఎమిరేట్స్ జ‌ట్టుకు సంబంధించిన నికోలస్ పూరన్ ( Nicholas Pooran) స్టంపింగ్ ( stumping ) మిస్ చేయడంపై సోషల్ మీడియాలో ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న నేపథ్యంలోనే డెసర్ట్ వైపర్స్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డెన్ ( Max Holden) ను స్టంపింగ్ చేయలేదని అంటున్నారు.

ఈ సంఘటన మ్యాచ్ 16వ ఓవర్ ఐదవ బంతి సందర్భంగా జరిగింది. MI ఎమిరేట్స్ vs డెసర్ట్ వైపర్స్ ( MI Emirates vs Desert Vipers ) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న డెసర్ట్ వైపర్స్ బ్యాట‌ర్‌ మ్యాక్స్ హోల్డెన్ 37 బంతుల్లో 42 పరుగులు సాధించారు. ఇందులో మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. పరుగులు చేసేందుకు డెసర్ట్ వైపర్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 16వ ఓవర్ ఐదవ బంతిని సిక్సర్ గా మలిచే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే కాస్త ముందుకు వెళ్లి ఆడాడు. కానీ బంతి మిస్సైంది. నేరుగా వికెట్ కీపర్ నికోల‌స్ పూర‌న్‌ చేతిలోకి ఆ బంతి వెళ్ళింది. అయితే మ్యాక్స్ హోల్డెన్ క్రీజులో లేకపోవడంతో సింపుల్ గా స్టంపింగ్ చేసే ఛాన్స్ నికోల‌స్ పురాన్ కు వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని కావాలనే వదిలేసిన నికోల‌స్ పురాన్, స్టంపింగ్ మాత్రం చేయలేదు.

Advertisement

అంతలోనే మ్యాక్స్ హోల్డెన్ క్రీజులోకి వచ్చేసాడు. ఈ సంఘటన పై అక్కడే ఉన్న ప్లేయర్లతో పాటు అంపైర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యాచ్ చూస్తున్నా అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ షాక్ తేరిపోక ముందే నెక్స్ట్ ఓవర్ లోనే మ్యాక్స్ హోల్డెన్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఆ స్టంపింగ్ మిస్ అయినందుకు డెసర్ట్ వైపర్స్ బతికిపోయినప్పటికీ, తమకు ఆ వికెట్ వద్దనుకుంది. దీంతో వెంటనే మ్యాక్స్ హోల్డెన్ ను రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ కు రప్పించేశారు. మీరు కావాలనే వదిలేసిన వికెట్ తమకు అస్సలు వద్దంటూ MI ఎమిరేట్స్ కు డెస‌ర్ట్‌ వైపర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: Ind vs SA 1st T20I: 100 సిక్స‌ర్ల‌తో పాండ్యా, 100 వికెట్ల‌తో బుమ్రా రికార్డు.. ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా విక్ట‌రీ

 

 

?igsh=d2FrM21sbmRvbnNx

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×