E-Paper
Advertisement

OTT Movie : తండ్రి హత్య కేసులో కూతురి ఇన్వెస్టిగేషన్… అడుగడుగునా అవాంతరాలు… తమన్నా నటించిన తోపు సిరీస్

OTT Movie : తండ్రి హత్య కేసులో కూతురి ఇన్వెస్టిగేషన్… అడుగడుగునా అవాంతరాలు… తమన్నా నటించిన తోపు సిరీస్
Advertisement

OTT Movie : తమన్నా భాటియా కెరీర్‌లోనే అత్యంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సిరీస్ ‘నవంబర్ స్టోరీ’. ఈ తమిళ క్రైమ్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్, అల్జైమర్స్‌తో బాధపడుతున్న ప్రముఖ క్రైమ్ నవల రచయిత చుట్టూ తిరుగుతుంది. మతిమరుపు తండ్రిపై ఒక హత్య కేసు పడటంతో కూతురు (తమన్నా భాటియా) దీని వెనుక ఉన్న రహస్యం బయట పెట్టడానికి ఒక సాహస యాత్ర చేస్తుంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా సాగే ఈ సిరీస్ తమన్నా ఫ్యాన్స్‌కి, థ్రిల్లర్ లవర్స్‌కి మస్ట్ వాచ్. ఒక్కసారి కుర్చీలో కూర్చుంటే ఆగకుండా చూసేస్తారు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఇంద్రా సుబ్రమణ్యం దర్శకత్వంలో వచ్చిన ‘నవంబర్ స్టోరీ’ (Season 1) 2021 మే 20 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది. ఇందులో తమన్నా భాటియా, G. M. కుమార్, అరుల్‌దాస్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఇది తమిళ ఒరిజినల్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్స్ లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనురాధ (తమన్నా భాటియా) ఒక ఎథికల్ హ్యాకర్. ఆమె జీవితం మొత్తం తన తండ్రి గణేశన్ (G. M. కుమార్) చుట్టే ఉంటుంది. గణేశన్ ఒక ప్రఖ్యాత క్రైమ్ నవలా రచయిత. కానీ అతను ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడు. తండ్రి వైద్య ఖర్చుల కోసం, అనురాధ తన పూర్వీకుల ఇంటిని అమ్మకానికి పెడుతుంది. ఈ సమయంలోనే వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఒక రోజు అనురాధ ఆ ఖాళీ ఇంట్లో ఒక మహిళ శవంతో పాటు రక్తం మడుగులో ఉన్న తన తండ్రిని చూసి షాక్ అవుతుంది. తన తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో, అతను హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తారు.

Read Also : ఆంటీ అరాచకం అమ్మాయిలు అంతకుమించి… ఇది అంతుచిక్కని కథ

Advertisement

ఈ పరిస్థితిలో తన తండ్రి నిర్దోషి అని నిరూపించడానికి అనురాధ రంగంలోకి దిగుతుంది. పోలీసులకు తెలియకుండా ఆధారాలను చెరిపివేసి, తండ్రిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ దర్యాప్తులో ఆమెకు తన స్నేహితుడు, ఒక నిజాయితీ గల ఇన్‌స్పెక్టర్ సుడలై (అరుల్‌దాస్) సహాయం చేస్తాడు. అనురాధ ఈ కేసును తవ్వేకొద్ది షాకింగ్ సీక్రెట్స్ బయట పడతాయి. ఆ సీక్రెట్స్ ఏంటి ? అనురాధ తన తండ్రిని నిర్దోషిగా నిరూపిస్తుందా ? ఆ హత్య ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×