E-Paper
Advertisement

Khushdil Shah: ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే ప్ర‌తిసారి టీమిండియా చేతిలో పాక్ ఓడిపోతోంది

Khushdil Shah: ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే ప్ర‌తిసారి టీమిండియా చేతిలో పాక్ ఓడిపోతోంది
Advertisement
Khushdil Shah:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉంటాయి. ముఖ్యంగా పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయి. టీమిండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు మ్యాచ్ ఆడితే షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా పై పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఖుష్దిల్ షా (Khushdil Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ అండదండలతోనే టీమిండియా తమపై గెలుస్తోందని… లేకపోతే ప్రతి మ్యాచ్ లో టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడించే వాళ్ళమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ అండతో టీమ్ ఇండియా ప్లేయర్లు రెచ్చిపోతున్నారు తప్ప… వాళ్లేం పీకలేరని పరువు తీశారు. దీంతో ఖుష్దిల్ షా చేసిన వ్యాఖ్య‌లు దుర‌మారం రేపుతున్నాయి.

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే ప్ర‌తిసారి టీమిండియా చేతిలో పాక్ ఓడిపోతోంది

అంపైర్లు టీమిండియాకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలు అవుతోందని రెండు రోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఖుష్దిల్ షా (Khushdil Shah). అయితే ఈ వ్యాఖ్యలు దుమారం రేపిన రెండు రోజులకే మళ్లీ టీమిండియాపై విషం కక్కారు. అంపైర్లే కాదు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి విషయంలో టీమిండియాకు అనుకూలంగానే ఐసీసీ ఉండడం వల్ల.. పాకిస్తాన్ ఓడిపోతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే ఐసీసీ అండ దండలు లేకపోతే.. ఇండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.

ప్రతి మ్యాచ్ లో కూడా ఇండియాపై వన్ సైడ్ వార్ కొనసాగి.. పాకిస్తాన్ విజయం సాధించేదని వ్యాఖ్యానించారు. ఐసీసీ బాస్ జై షా ఉండ‌టం వ‌ల్లే, టీమిండియాకు అన్ని క‌లిసి వ‌స్తున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి డబ్బులు తీసుకొని… ఐసీసీ ఇలా అమ్ముడుపోతోందని కూడా వ్యాఖ్యానించారు. ఐసీసీ పై బీసీసీఐ పెత్తనం ఉన్నన్ని రోజులు… పాకిస్తాన్ ఓడిపోవడం జరుగుతూనే ఉంటుందని బాంబు పేల్చారు. ఈ విషయంలో ఐసీసీ ద్వారానే మారాలని కోరారు. ఐసీసీ కుమ్మక్కు వ్యవహారం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఎంతమంది తోపు క్రికెటర్లు వచ్చినా, టీమిండియాను ఓడించడం అసాధ్యం అన్నారు. బీసీసీఐ, ఐసీసీ అలాగే టీమ్ ఇండియా పై ఆరోపణలు చేసిన పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఖుష్దిల్ షాపై ఇండియన్ ఫ్యాన్స్ తమ స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు. గాజులు వేసుకున్న దద్దమ్మలు ఇలాగే మాట్లాడుతారని మండిపడుతున్నారు. ఇండియాను నిజాయితీగా ఆడి ఓడించే ధైర్యం పాకిస్తాన్ కు లేదంటూ ర్యాగింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×