E-Paper
Advertisement

IPL: IPL హీరోలు.. పొట్టి కప్ జీరోలు..

IPL: IPL హీరోలు.. పొట్టి కప్ జీరోలు..
Advertisement

అభిమానులను ఊరించి ఉసూరుమనిపించడం… టీమిండియా ఆటగాళ్లకే సాధ్యం. ప్రతీ మెగా టోర్నీలోనూ లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టడం… కీలక మ్యాచ్ ల్లో బోల్తా కొట్టడం ఈ మధ్య మామూలైపోయింది. T20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలమై… ఫ్యాన్స్ తో చివాట్లు తింటున్నారు. ఐపీఎల్లో అదరగొట్టే క్రికెటర్లు… దేశం కోసం ఆడాల్సి వచ్చినప్పుడు ఎందుకు జీరోలవుతున్నారని మండిపడుతున్నారు. ఐపీఎల్ ని నిషేధిస్తే కానీ టీమిండియా ఆటగాళ్లు దారిలోకి వచ్చేలా లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఐపీఎల్ అని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. ఐపీఎల్‌ మోజులో పడి టీమిండియా ఆటగాళ్లలో కొందరు ప్రధాన మ్యాచ్ ల్లో అస్సలు ఆడటం లేదని అంటున్నారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌, బుమ్రా లాంటి ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే సూపర్ అనిపిస్తారు తప్ప… వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు పనికిరారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్‌ శర్మ… టీమిండియా కెప్టెన్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్‌ లాంటి ప్రైవేట్ లీగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను పోల్చకూడదని రోహిత్‌కు ఈ పాటికే అర్థమై ఉండాలని సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

ఇక బుమ్రా మీద కూడా ఫ్యాన్స్ పూర్తి గుస్సాగా ఉన్నారు. ఎందుకంటే… 2013 సీజన్లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన బుమ్రా… ఇప్పటిదాకా ప్రతీ సీజన్ లోనూ ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా ఆడాడు. అదే దేశం కోసం ఆడాల్సి వస్తే… గాయాల సాకుతో తప్పుకుంటున్నాడని ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ కు ఎంపిక కూడా అయిన బుమ్రా… ఆ తర్వాత గాయం సాకు చూపి ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంట్లో కూర్చున్నాడని చివాట్లు పెడుతున్నారు. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం కనబరిచే బుమ్రా… కేవలం ఐపీఎల్ కే పరిమితమా? దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడడా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాగైతే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి… కేవలం డబ్బులొచ్చే లీగ్ ల్లోనే ఆడుకోమని సలహా ఇస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×