E-Paper
Advertisement

IND VS SA ODI: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌..టీమిండియా కెప్టెన్ హర్షిత్ రాణా ?

IND VS SA ODI: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌..టీమిండియా కెప్టెన్ హర్షిత్ రాణా ?
Advertisement

IND VS SA ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Team India vs South Africa ) మధ్య మరో వారం రోజుల్లోనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్ ఎవరు అవుతారని చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో హర్షిత్ రాణా పేరు తెరపైకి వచ్చింది. హర్షిత్ రాణాకు వన్డే కెప్టెన్సీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

టీమిండియా కెప్టెన్ గా హర్షిత్ రాణా ( Harshit Rana)?

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో జట్టు ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫోకస్ చేసింది. అయితే మొన్న మొదటి టెస్టు సందర్భంగా కెప్టెన్ గిల్ మెడనొప్పి బారినపడ్డాడు. అటు శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయం బారిన పడి కోలుకుంటున్నాడు. అంటే వన్డే సిరీస్ నేపథ్యంలో శుభ‌మాన్ గిల్‌ తో పాటు శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు దూరం కాబోతున్నారట. వీళ్ళిద్దరూ దూరం అయితే, కచ్చితంగా టీమిండియాకు కొత్త కెప్టెన్ అవసరం ఉంటుంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్ ను నియామకం చేయాల్సి ఉంటుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్, గౌతమ్ గంభీర్‌ శిష్యుడు హర్షిత్ రాణా ( Harshit Rana) పేరు తెరపైకి వచ్చింది. కావాలని అతని ట్రోలింగ్ చేసేందుకు అతని పేరును తీసుకువచ్చారా ? లేదా హర్షిత్ రాణాకు కెప్టెన్సీ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ ప్రెషర్ పెడుతున్నాడా ? అనేది తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే హర్షిత్ రాణాకు వన్డే కెప్టెన్సీ ఇస్తారన్న వార్త బయటకు రావడంతో టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) చెత్త నిర్ణయాల వల్ల ఇలాంటి దరిద్రాలు జరుగుతున్నాయని, హర్షిత రాణా కెప్టెన్ అయితే, వన్డే సిరీస్ కోల్పోవడం గ్యారంటీ అంటున్నారు.

కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లో ఒకరికి ఛాన్స్

Advertisement

శుభ‌మాన్‌ గిల్ అలాగే శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు దూరం అవుతే, కేఎల్ రాహుల్ తో ( Kl Rahul )పాటు అక్ష‌ర్‌ పటేల్ కు ( Axar Patel ) కెప్టెన్సీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ మరొకరికి వైస్ కెప్టెన్సీ ఇస్తారట. ప్రాథమిక అంచనా ప్రకారం కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×