E-Paper
Advertisement

Varanasi : రాజమౌళిని క్షమించే ప్రసక్తే లేదు, ముదురుతున్న వివాదం

Varanasi : రాజమౌళిని క్షమించే ప్రసక్తే లేదు, ముదురుతున్న వివాదం
Advertisement

Varanasi : సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్లు కొన్నిసార్లు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. కొన్ని మాటలు మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి లేకుంటే మొదటికే మోసం వస్తుంది. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ దర్శకుడుగా పేరు సాధించుకున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళికి ఉంది.

ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ ఎలా ఉండబోతుందో అని ఒక వీడియో డిజైన్ చేశాడు రాజమౌళి.

Advertisement

ఆ వీడియోను చూపించడానికి పెద్ద ఎత్తున రామోజీ ఫిలిం సిటీ లో భారీ వేడుక చేశారు. అభిమానులంతా కూడా దానికి హాజరయ్యారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన అది అనుకునే టైంకి సరిగ్గా ప్లే కాలేదు. అయితే అప్పుడు రాజమౌళి అసహనంతో, నేను మామూలుగా దేవుని నమ్మను కానీ మా నాన్నగారు మాట్లాడుతూ హనుమంతుడు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాడు అని చెప్పారు. ఇదేనా నడిపించడం అంటే అంటూ బాధపడ్డారు.

రాజమౌళి ని క్షమించే ప్రసక్తే లేదు 

రాజమౌళి మాట్లాడిన తీరు పైన చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది కేసులు కూడా పెట్టారు. ఇక తాజాగా హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.

Advertisement

రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.

రాజమౌళి క్షమాపణలు చెబుతారా?

రాజమౌళి ఆ వ్యాఖ్యలు ఏదో అసహనంతో చేశారు. రాజమౌళి నేను దేవుని నమ్మను అని చెప్పడం మొదటి సారి కాదు గతంలో కూడా పలు సందర్భాలలో చెప్పారు. అయితే ఈ తరుణంలో రాజమౌళి నిజంగానే ముందుకు వచ్చి నేను దేవుని నమ్మను. నేను చేసిన కామెంట్స్ ఎవరి మనోభావాలైనా దెబ్బ తీసి ఉంటే క్షమించండి అంటూ ముందుకొచ్చి క్లారిటీ ఇస్తారా? క్షమాపణలు చెబుతారా? అని చాలామందికి ఉన్న ఆలోచన.

Also Read: Abishan jeevinth : టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు కోసం సూపర్ స్టార్ రజినీకాంత్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×