E-Paper
Advertisement

Girlfriend: నడిరోడ్డు మీదే బూతులు.. వాచిపోయిన చెంపలు..

Girlfriend: నడిరోడ్డు మీదే బూతులు.. వాచిపోయిన చెంపలు..
Advertisement

Girlfriend:ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, అతని గర్ల్‌ఫ్రెండ్‌ జేడ్ యాబ్రోకు సంబంధించిన ఓ వీడియో… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే… క్లార్క్‌ను చెడామడా బూతులు తిట్టేయడమే కాదు, అతని రెండు చెంపలు వాయించింది… గర్ల్‌ఫ్రెండ్‌ జేడ్ యాబ్రో. ఆమె ఆగ్రహానికి ఓ కారణం ఉంది. క్లార్క్ తనను మోసం చేసి, పిప్ ఎడ్వర్డ్ అనే మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ… జేడ్ యాబ్రో బహిరంగంగా గొడవ చేసింది. నోటి కొచ్చిన బూతులు తిట్టింది. కొట్టింది కూడా. అదంతా వీడియోలో స్పష్టంగా ఉంది.

గొడవ చేయొద్దని జేడ్‌కు క్లార్క్‌ సర్దిచెప్పేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. కానీ, ఆమె ఏ మాత్రం రాజీ పడలేదు. మరింత రెచ్చిపోయి… బూతుల డోస్ పెంచింది. పిప్ ఎడ్వర్డ్, నువ్వు ఫలానా రోజు ఏకాంతంగా గడిపారని, నువ్వో మదమెక్కిన కుక్కవు, పెంటకుప్పలో ఓ ముక్కవు అంటూ… పబ్లిగ్గా క్లార్క్‌ను కడిగి పారేసింది… జేడ్. తాను ఏ తప్పూ చేయలేదని క్లార్క్‌ సంజాయిషీ ఇవ్వబోతే… పిప్ ఎడ్వర్డ్ తో జరిపిన ఫోన్‌ చాటింగ్ ను బయటపెట్టాలని జేడ్‌ డిమాండ్‌ చేసింది. గొడవ జరుగుతున్న సమయంలో జేడ్‌ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు. ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా… క్లార్క్‌ కుంటుతూ వారి వెంటపడి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. క్లార్క్‌ అడ్డుతగలడంతో జేడ్ మరింత రెచ్చిపోయింది. తనకు జరిగినదంతా తెలుసని, అబద్ధాలు చెప్పి తనను నమ్మించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. కొత్త ప్రియురాలిని ఇండియాకు పంపి, నువ్వు కూడా అక్కడికి వెళ్లాలనుకోలేదా? అని నిలదీసింది. నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగలేదని క్లార్క్ చెప్పబోయినా… జేడ్ వినకుండా దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లి పోయింది.

Advertisement

ఈ ఉదంతంపై స్పందించిన క్లార్క్‌… తన బహిరంగ ప్రవర్తనపై ప్రజలకు క్షమాపణ చెప్పాడు. భార్య కైలీని వదిలేసిన క్లార్క్… ప్రముఖ మోడల్‌ అయిన జేడ్‌తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడు తనను కూడా వదిలేసి క్లార్క్ మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపిస్తూ… జేడ్ నడిరోడ్డు మీదే రచ్చరచ్చ చేసింది.

Related News

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

Big Stories

Advertisement
×