E-Paper
Advertisement

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే
Advertisement

Fakhar Zaman On Imam-ul-Haq : పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అనేక రకాల వింతలు జరుగుతూ ఉంటాయి. ఆ జట్టులో ప్లేయర్లు లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ కు గురి కావడం గ్యారెంటీ. సింపుల్ గా చెప్పాలంటే, పాకిస్తాన్ టీమ్, ఓ కామెడీ స‌ర్కార్ లాగా మారింది. అయితే లేటెస్ట్ గా సొంత జట్టు ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఓపెనర్ ఫ‌ఖ‌ర్ జమాన్ (Fakhar Zaman). తన తోటి క్రికెటర్ మొద్దు నిద్ర పోతాడని…వికెట్ల మధ్య పరిగెత్తడం కూడా రాదు అంటూ హేళన చేస్తూ మాట్లాడారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ అల్లుడు ఇమామ్ ఉల్ హక్ పైన ఫ‌ఖ‌ర్ జమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

త‌న‌ మామ లాగా ఇమామ్ ఉల్ హక్ బ‌ద్ధ‌క‌స్తుడే…ర‌న్స్ కూడా చేయ‌రాదు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా బాల్ టాంపరింగ్ కు పాల్పడిన దుర్మార్గుడు ఓపెనర్ ఫఖ‌ర్ జమాన్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడుతూనే.. పాకిస్తాన్ ప్లేయర్ల వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టారు. ముఖ్యంగా ఇంజమామ్ అల్లుడు ఇమామ్ ఉల్ హక్ రన్నింగ్ పై దారుణంగా ట్రోల్ చేశారు. తన మామ ఇంజమామ్ తరహాలోనే ఇమామ్ కూడా చాలా బద్ధకస్తుడు, జిడ్డుగాడు అంటూ బాంబు పేల్చారు. అతనితో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని బాంబు పేల్చారు. వికెట్ల మధ్య పరుగులు తీసేటప్పుడు.. చాలా నెమ్మదిగా అతడు స్పందిస్తాడని ఆరోపణలు చేశారు. పరుగుకు పిలిచిన 30 నిమిషాలకు స్పందించే రకం… అంటూ ఇమామ్ పరువు తీశాడు. బౌలర్ ఎండ్ వైపు ఇమామ్ ఉల్ హ‌క్ ఉంటే.. కచ్చితంగా నిద్రపోతాడని కూడా పరువు తీశారు. గట్టిగా అరిస్తే తప్ప, పరుగు కోసం రాడని హేళన చేశారని చేశారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫోకస్ చేసిన ఫఖ‌ర్ జమాన్

2027 వన్డే వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో తాను సిద్ధం అవుతున్న‌ట్లు ఫఖ‌ర్ జమాన్ వెల్లడించారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ.. తాను ప్రాక్టీస్ మాత్రం వదలలేదని వివరించారు. పాకిస్తాన్కు వన్డే వరల్డ్ కప్ తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాపై పాకిస్తాన్ గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తానని కూడా వివరించారు.

ఇంజమామ్ (Inzamam) రన్ ఔట్ల‌ పై కూడా ట్రోలింగ్

Advertisement

ఇంజమామ్ అల్లుడు ఇమామ్ పై ఫఖర్ జమాన్ చేసిన కామెంట్ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ రనౌట్ల గురించి కూడా ఇప్పుడు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇండియ‌న్స్ ఫ్యాన్స్. ప్రపంచంలో అత్యధిక సార్లు ఇంజమామ్ రనౌట్ అయినట్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో 46 సార్లు రనౌట్ అయ్యాడని.. అతడి లాగానే ఇమామ్ కూడా తయారయ్యాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఫఖ‌ర్ జమాన్ బయటపెట్టినట్లు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×