E-Paper
Advertisement

Dinesh Karthik:-  ఆట మరిచిపోయాడా.. ఆడడంపై ఆసక్తి పోయిందా… దినేశ్ కార్తీక్‌పై ఫైర్

Dinesh Karthik:-  ఆట మరిచిపోయాడా.. ఆడడంపై ఆసక్తి పోయిందా… దినేశ్ కార్తీక్‌పై ఫైర్
Advertisement

Dinesh Karthik:- అదేంటో… కొందరు వరుసగా విఫలం అవుతున్నా అవకాశాలు దక్కుతూనే ఉంటాయి. అలాంటి అదృష్టవంతుడైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా ఒకరు. నిజంగా టాలెంట్ ఉన్న ఆటగాడే. మంచి గేమ్ ఫినిషర్ కూడా. ఒత్తిడిలోనూ బౌండరీలు కొట్టగల బ్యాట్స్‌మనే. అయినా గానీ ఎందుకనో ఈ సీజన్‌లో విఫలం అవుతూనే ఉన్నాడు. వరుసగా ఆరు మ్యాచుల్లో ఫెయిల్. ఒకటి కాకపోతే ఒక మ్యాచ్‌లో అయినా సత్తా చాటాల్సిన దినేశ్ కార్తీక్.. ఒక్క మ్యాచ్‌లో తప్ప అన్నీ సింగిల్ డిజిట్లే.

గత ఆరు మ్యాచ్‌లలో దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఫిగర్స్ చూడండి. 0, 9, 1, 0, 28, 7. వీటిని పరుగులు అంటారా. మొత్తం ఆరు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు జస్ట్ 45. టోటల్‌గా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. లేటెస్ట్‌గా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌ ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బ్యాటింగ్‌కు దిగిన బౌలర్లు కూడా ఇంత కన్నా మెరుగైన పరుగులు చేస్తారని నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఛేజింగ్‌లో ఒత్తిడి ఉండే మాట వాస్తవమే. కాని, ఫస్ట్ ఇన్నింగ్సులోనూ అదే తరహా బ్యాటింగ్. గేమ్ ఫినిష్ అవుతున్నప్పుడు బ్యాట్ ఝుళిపించాల్సిన సమయంలో మెల్లగా ఆడతాడు. ఛేజింగ్ చేసే సమయంలో ధాటిగా ఆడాలనే తొందరలో ఔట్ అవుతున్నాడు. ఈ రెండూ కరెక్ట్ కాదంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. నిలబడాలి, ఆడాలి, గెలిపించాలి. అప్పుడే గేమ్ ఫినిషర్ అంటారు. కాని, దినేశ్ కార్తీక్ వాటం వేరేలా కనిపిస్తోంది. అతని ఆట చూసి.. ఆడడం మరిచిపోయాడా లేక ఆటంటే ఆసక్తి పోయిందా… ఏంటా బ్యాటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×