E-Paper
Advertisement

Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డిపై ధోని ఫ్యాన్స్ ట్రోలింగ్‌.. CSKలోకి తీసుకోవ‌ద్ద‌ని డిమాండ్స్‌!

Nitish Kumar Reddy:  నితీశ్ కుమార్ రెడ్డిపై ధోని ఫ్యాన్స్ ట్రోలింగ్‌.. CSKలోకి తీసుకోవ‌ద్ద‌ని డిమాండ్స్‌!
Advertisement

Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు, నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అనవసరంగా మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ గురవుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ విధానం పై హాట్ కామెంట్స్ చేశాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) అభిమానులు. ఇలాంటోడిని టీమిండియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రేడ్ ద్వారా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులోకి తీసుకోకుడ‌ద‌ని అంటున్నారు. తెలుగోడని గౌరవిస్తే, నెత్తిన ఎక్కి కూర్చున్నాడని ఫైర్ అవుతున్నారు.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

ధోనిపై నితీష్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్

Advertisement

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, టాలీవుడ్ హీరో కార్తికేయ ఇద్దరు ఓ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. 2024లో భజే వాయువేగం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నితీష్ కుమార్ రెడ్డి అలాగే కార్తికేయ వీడియో కాల్ లో మాట్లాడుతూ మహేంద్రసింగ్ ధోని టాపిక్ తీసుకువచ్చారు. నీకు ఏ క్రికెటర్ ఇష్టమని తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని కార్తికేయ అడుగుతాడు. ఈ సందర్భంగా తనకు విరాట్ కోహ్లీ ఇష్టమని వ్యాఖ్యానిస్తాడు. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీకి తాను అభిమానిని స్పష్టం చేస్తాడు నితీష్ కుమార్ రెడ్డి.

అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీకి బ్యాటింగ్ టెక్నిక్ సరిగా ఉండదని బాంబు పేల్చాడు నితీష్ కుమార్ రెడ్డి. ధోని కంటే విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా నుంచి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ధోని అభిమానులు.  అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ట్రేడ్ ప్రక్రియ ద్వారా నితీష్ కుమార్ రెడ్డి వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే వెంటనే ఆ ప్రక్రియను ఆపాలని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అస్సలు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోకూడదని CSK, ధోని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ధోని గురించి నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఇప్పుడు వైరల్ చేసి ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ టెక్నిక్ లేని ధోని జ‌ట్టులోకి నువ్వేందుకు అని ఆగ్ర‌హిస్తున్నారు. కాగా ట్రేడ్ ప్ర‌క్రియ ద్వారా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి చెన్నై కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.మ‌రి ఈ ట్రోలింగ్ నేప‌థ్యంలో నితీష్ కు నిరాశ ఎదుర‌య్యే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×