E-Paper
Advertisement

Sleeping With Socks: సాక్సులు ధరించే నిద్రపోతున్నారా.. ఈ అలవాటు మంచిదా? కాదా? తెలుసుకోండిలా!

Sleeping With Socks: సాక్సులు ధరించే నిద్రపోతున్నారా.. ఈ అలవాటు మంచిదా? కాదా? తెలుసుకోండిలా!
Advertisement

Sleeping With Socks: అసలే చిలికాలం.. బయటికి రావాలంటేనే గజగజ వణికే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చలికి తట్టుకోలేక చాలామంది రాత్రిళ్లు సాక్సులు ధరించి నిద్రపోతుంటారు. అలా పడుకుంటే అరికాళ్లకు చలి వేయదని, వెచ్చగా ఉంటుందని, చక్కగా నిద్రపోవచ్చని సాక్సులు ధరిస్తుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదా, కాదా? అనే సందేహాలు చాలా మందిలో ఇప్పటికీ ఉన్నాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

* సాక్సులు ధరించడం వల్ల పాదాల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, మొత్తం శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. పాదాలు వెచ్చగా ఉంటే త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. సాక్సులతో నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ పరిశోధనల్లో తేలాయి.
* శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా.. రక్త నాళాలు సంకోచిస్తాయి. ఇలాంటప్పుడు సాక్సులు వేసుకోవడం వల్ల పాదాలు వెచ్చగా ఉండి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* చలి కారణంగా పాదాలు పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. ఈ సీజన్‌లో పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసి సాక్సులు ధరిస్తే.. తేమని సాక్సులు నిలిపి ఉంచుతాయి. దీంతో పాదాలు మృదువుగా మారుతుంది.

సాక్సులతో వచ్చే సమస్యలు:

Advertisement

* సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. సాక్సులు ధరించడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా కలుగుతాయి. బిగుతుగా లేదా మురికిగా ఉన్న సాక్సులు ధరిస్తే. గాలి సరిగా ఆడక పాదాలు చెమట పట్టి, వేడిగా ఉంటాయి. ఇది వేళ్ల చుట్టూ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, దుర్వాసనకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
* మరీ బిగుతుగా ఉండే సాక్సులు ధరించడం వల్ల పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల శరీరంలోని మిగతా భాగాలపై కూడా ప్రభావం చూసవచ్చు. కాబట్టి.. నిద్రపోయేటప్పుడు వదులుగా ఉండే సాక్సులు ధరించడం మంచిది.
* నిపుణుల సూచనలు ప్రకారం.. సాక్సులు ధరించాలనుకునేవారు నిద్రపోయేటప్పుడు అవి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు రక్త ప్రసరణకు అడ్డు తగలకుండా ఉండేందుకు బిగుతుగా లేని, వదులైన సాక్సులను మాత్రమే ధరించాలని సలహా ఇస్తున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×