E-Paper
Advertisement

Croatia vs Canada : కెనడా ఔట్‌.. నాకౌట్‌కు క్రొయేషియా..

Croatia vs Canada : కెనడా ఔట్‌.. నాకౌట్‌కు క్రొయేషియా..
Advertisement

Croatia vs Canada : 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా… తాజా వరల్డ్‌కప్‌లోనూ అదరగొడుతోంది. వరుసగా రెండో విజయం సాధించి నాకౌట్ దశకు చేరింది. మరోవైపు కెనడా వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అలా మొదలైందో లేదో… క్రొయేషియాకు షాకిచ్చింది… కెనడా. ఆట మొదలైన నిమిషానికే తొలి గోల్ చేసింది. కెనడా ఆటగాడు ఆల్ఫోన్సో డేవిడ్ చక్కటి హెడర్ గోల్‌తో కెనడాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. కానీ, ఆ తర్వాత క్రొయేషియా విజృంభించి ఆడింది. ఒక్క అవకాశం కూడా కెనడాకు ఇవ్వకుండా… ఎటాకింగ్ గేమ్ ఆడింది. కెనడా గోల్ పోస్టు మీద పదే పదే దాడులు చేసింది. ఆట 26 నిమిషంలో క్రొయేషియా ఆటగాడు ఆండ్రేజ్ క్రామరిక్ గోల్ చేసినా… అతనికి పాస్ అందించిన లివాజా రక్షణ గీతను దాటి ఆఫ్ లైన్లో ఉండటంతో… రిఫరీ గోల్ ఇవ్వలేదు. అయితే మరో పది నిమిషాలకే… ఆండ్రేజ్ క్రామరిక్ మరో అద్భుత గోల్ చేసి… 1-1తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత క్రొయేషియా మరింత దూకుడుగా ఆడింది. 44వ నిమిషంలో మార్కో లివాజా చేసిన గోల్‌తో… తొలి అర్ధభాగం ముగిసే సరికి 2-1 ఆధిక్యంలో నిలించింది… క్రొయేషియా. ఇక రెండో అర్ధభాగం మొదలయ్యాక 25 నిమిషాల పాటు ఇరు జట్లు గోల్ చేయలేదు. 70వ నిమిషంలో ఆండ్రేజ్ క్రామరిక్ డబుల్ గోల్‌తో క్రొయేషియా 3-1 గోల్స్ తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండో అర్ధభాగం ముగిసే దాకా ఇరు జట్లు గోల్ చేయలేదు. చివర్లో ఇచ్చిన అదనపు సమయంలో, 94వ నిమిషంలో లోవ్రో మాయెర్ వేసిన గోల్‌తో కెనడాపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది… క్రొయేషియా. ఈ మ్యాచ్‌లో కెనడా ఆటగాడు ఆల్ఫోన్సో డేవిడ్ చేసిన గోలే… ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో ఆ దేశానికి తొలి గోల్. తొలిసారి 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడిన కెనడా… ఒక్క గోల్ చేయకుండానే లీగ్ దశ నుంచే వెనుదిరిగింది. 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడిన కెనడా… తొలి గోల్ నమోదు చేయడం ఒక్కటే ఆ దేశ అభిమానులకు ఊరట కలిగించే విషయం.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×