E-Paper
Advertisement

Rahul Gandhi: మూడు నెలల నుంచి తపస్సు చేస్తున్నా: రాహుల్ గాంధీ

Rahul Gandhi: మూడు నెలల నుంచి తపస్సు చేస్తున్నా: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లోని రెండవ జ్యోతిర్లింగమైన బాబా మహాకాల్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. భోలేనాథ్ ఆశీస్సులు పొందారు. నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి అభిషేకం చేశారు రాహుల్. సంప్రదాయ దుస్తులు ధోతీ, ఎరుపురంగు అంగవస్త్రం, రుద్రాక్షలు ధరించి పూజలు చేసారు. ఆలయ అర్చకులు ఆయనకు గంధం, తిలకం పెట్టారు.

మహాకాల్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన.. తపస్విలు పూజింపబడే దేశం ఇది అని రాహుల్ అన్నారు. తాను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ జీవితంలో చివరి శ్వాస వరకు కష్టపడే రైతులు, కార్మికులు నిజమైన తపస్విలు అని.. వారి ముందు తాను చేసేది చాలా చిన్నది అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతులెత్తి దేవుడిని పూజిస్తుంది కానీ.. నిజమైన తపస్వీలు అయిన రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, విద్యావంతులైన యువకుల భవిష్యత్తును నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×