E-Paper
Advertisement

IPL 2026: RCBకి ఊహించ‌ని షాక్‌..చిన్న‌స్వామిలో ఆడాలంటే ఈ 3 కండీష‌న్లు..!

IPL 2026: RCBకి ఊహించ‌ని షాక్‌..చిన్న‌స్వామిలో ఆడాలంటే ఈ 3 కండీష‌న్లు..!
Advertisement

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. మొదటి దశ షెడ్యూల్ ను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అలాగే ఐపీఎల్ 2026 టోర్నమెంటులో మొట్టమొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ( RCB vs SRH Opening Match ) మధ్య జరగనుంది. మార్చి 28వ తేదీన చిన్న స్వామి స్టేడియం ( CHINNASWAMY STADIUM ) వేదికగా బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది.

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

చిన్న స్వామి స్టేడియంలో ఆడాలంటే ఈ మూడు కండిషన్లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( RCB ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు హోం గ్రౌండ్ ఏది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి దశ ఐపిఎల్ షెడ్యూల్లో మాత్రం చిన్నస్వామి స్టేడియం వేదికగా రెండు మ్యాచ్ లు జరుగుతాయని వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తల పడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తమ హోమ్ మ్యాచులు చిన్న స్వామి స్టేడియం వేదికగా ఆడాలంటే మూడు కండిషన్లు కర్ణాటక సర్కారు పెట్టినట్లు తెలుస్తోంది. 2025 టోర్నమెంటు విజేతగా నిలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) యాజమాన్యం విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి చిన్న స్వామీ స్టేడియం దగ్గర 11మంది బెంగళూరు అభిమానులు మరణించారు.

ఈ దారుణమైన సంఘటన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం  ( CHINNASWAMY STADIUM )వేదికగా మ్యాచ్ లు  జరిగే అవకాశాలు క్రమక్రమంగా సన్నగిల్లాయి. అయితే లేటెస్ట్ గా కర్ణాటక ప్రభుత్వం మూడు కండిషన్లు పెట్టి మ్యాచ్లో నిర్వహించుకునేలా పర్మిషన్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. చిన్నస్వామి స్టేడియం లో 30 వేల కంటే ఎక్కువ మంది అభిమానులు రాకుండా యాజమాన్యం చూసుకోవాలని పేర్కొంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం కెపాసిటీ 35000 ఉన్నప్పటికీ 30 వేలకే క్లోజ్ చేయాలని పేర్కొంది. అలాగే స్టేడియం బయట సెలబ్రేషన్స్, లోపట కూడా రచ్చ చేయడం బ్యాన్ చేసింది. ఒకవేళ ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పమని తెలిపింది. ఇక చిన్నస్వామి స్టేడియానికి సంబంధించిన ఎగ్జిట్ గేట్లు కాస్త పెద్దగా చేయాలని ఆదేశించింది. ఈ మూడు కండిషన్లు ఓకే అయితేనే చిన్నస్వామి లో మ్యాచ్ లు జరుగుతాయని పేర్కొంది కర్ణాటక సర్కార్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×