E-Paper
Advertisement

Romantic Comedy OTT : చిక్కుల్లో పడేసే సినీ నటుడి ప్రేమ… పాత్రలో జీవిస్తూ భార్యకు స్కెచ్… ఎక్కడా చూడని విచిత్రం

Romantic Comedy OTT : చిక్కుల్లో పడేసే సినీ నటుడి ప్రేమ… పాత్రలో జీవిస్తూ భార్యకు స్కెచ్…  ఎక్కడా చూడని విచిత్రం
Advertisement

Romantic Comedy OTT : ఓటీటీలో ప్రతి రోజు ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. ప్రపంచంలో అన్ని మూలల నుండి వస్తున్న ఈ సినిమాలకి ఓటీటీ ఒక వేదిక అయింది. అయితే వీటిలో డిఫరెంట్ స్టోరీతో నడిచే సినిమాలను, భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి ఆడియన్స్ కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ. ఈ కథలో ఒక అమ్మాయి, సినిమా హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది ఈ సినిమాను చూస్తుంటే.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ డార్క్ కామెడీ మూవీ పేరు ‘ది హస్బెండ్స్ ఆఫ్ రొసారియో’ (The Husbands of Rosario). 2018లో వచ్చిన ఈ సినిమా ఆల్ఫా హబోన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో యోగి జువాన్ పాత్రలో జోరోస్ గాంబోవా, సారి జువాన్ పాత్రలో కేట్ అలెజాండ్రినో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సారి అనే అమ్మాయి ఒక పెద్ద సినిమా హీరోకి పిచ్చి ఫ్యాన్. ఆ హీరో పేరే యోగి. అతను మామూలు నటుడు కాదు, సీన్లోకి వస్తే ఊగిపోయే రకం. సారి విచిత్రంగా తన కలల రాజకుమారుడైన ఆ హీరోనే పెళ్లి చేసుకుని, లైఫ్ లో సెటిల్ అయిపోయింది. కానీ అసలు కథ పెళ్లి తర్వాతే మొదలవుతుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు, మనోడి నటన సారి చావుకు వస్తుంది. అతను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఇక పెళ్లయ్యాక ఆ నటన పిచ్చి ఇంటికి కూడా పాకుతుంది. వాడు సినిమాలో బిచ్చగాడి వేషం వేస్తే, ఇంటికొచ్చి కూడా చింపిరి గుడ్డలతో బిచ్చగాడిలాగే ఉంటాడు. ఒకరోజు పీటల మీద కూర్చున్న పూజారిలా బిల్డప్ ఇస్తాడు. మరోరోజు కుక్కలా మొరుగుతాడు. పాపం మన సారికి రోజుకో కొత్త మొగుడు తగులుతున్నట్టు ఉంటుంది. మొగుడితో కాపురం చేద్దామంటే వాడు ఏ రోల్ లో ఉంటాడో అర్థం కాక ఆ పిల్ల పిచ్చెక్కిపోతుంటుంది.

ఇదంతా ఒకెత్తయితే, వాడు ఒక సినిమాలో సీరియల్ కిల్లర్ వేషం వేయాల్సి వస్తుంది. ఇక చూడాలి రచ్చ! ఆ కిల్లర్ రోల్ లోకి వెళ్ళాక వాడు నిజంగానే నరుక్కుంటూ పోతాడేమో అన్నంత రేంజ్ లో రెచ్చిపోతాడు. చేతిలో కత్తి పట్టుకుని పెళ్ళాం వెనకాలే పడతాడు. నటనో, నిజమో తెలియక సారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీయాల్సి వస్తుంది. చివరికి యోగి వల్ల ఇంకెన్ని సమస్యలు వస్తాయి ? సారి ఈ సమస్య నుంచి ఎలా బయట పడుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఓ వర్షం కురిసిన రాత్రి… ఫ్రెండ్ తమ్ముడితోనే యవ్వారం… ఐయండిబిలో టాప్ రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×