E-Paper
Advertisement

BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా
Advertisement

BAN VS PAK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఒకవైపు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. మరోవైపు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగింది. అయితే ఈ క్రమంలో మొదటి టెస్ట్ గెలిచిన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో కూడా పాకిస్తాన్ ను చిత్తు చేసింది. దీంతో బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ పై 78 పరుగుల తేడాతో విజయం సాధించి, సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ ను తొలిసారిగా వైట్ వాష్ చేసింది బంగ్లాదేశ్. దీంతో పాకిస్తాన్ పరువు మరోసారి గంగలో కలిసింది.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సిల్హెట్ వేదికగా రెండో టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. మొన్న 16వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్… నేటితో ముగిసింది. ఈ టెస్ట్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై 78 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి వరకు పోరాడిన పాకిస్తాన్ దారుణ ఓటమిని చవిచూసింది. ఈ రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, తన తొలి ఇన్నింగ్స్ లో 278 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసింది. అటు పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్ లో 232 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 358 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.

దీంతో 78 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతేకాదు తమ సొంత గడ్డపై తొలిసారిగా పాకిస్తాన్ ను వైట్ వాష్ చేసింది బంగ్లాదేశ్. ఇది ఇలా ఉండగా గడిచిన 10 నెలల్లో బంగ్లాదేశ్ చేతిలో వరుసగా మూడు సిరీస్ లు కోల్పోయింది బంగ్లాదేశ్. మొదట బంగ్లాదేశ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్… మొన్న వన్డే సిరీస్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా టెస్ట్ సిరీస్ లో కూడా వైట్ వాష్ అయింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ ను తొలగించాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాబర్ ఆజం కు కెప్టెన్సీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

Advertisement

పాకిస్తాన్ పై రెండు టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకున్న బంగ్లాదేశ్… పెను సంచలనం సృష్టించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకు వెళ్ళింది బంగ్లాదేశ్. అటు టీమిండియా ఆరో స్థానానికి దిగజారింది. పాకిస్తాన్ 8వ స్థానానికి పడిపోయింది. ఇక ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ రెండో స్థానానికి పరిమితమైంది.

Also Read: Trolls On Rizwan: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×