E-Paper
Advertisement

‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్!’.. ఎన్టీఆర్‌పై అల్లు అర్జున్ క్రేజీ ట్వీట్..

‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్!’.. ఎన్టీఆర్‌పై అల్లు అర్జున్ క్రేజీ ట్వీట్..
Advertisement

JR NTR: గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (తారక్) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రపంచం నుండి, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఒక ప్రత్యేకమైన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, బావ-బావమరుల వరసను గుర్తుచేస్తూ బన్నీ పెట్టిన పోస్ట్ నందమూరి, అల్లు అర్జున్ అభిమానులను ఖుషీ చేస్తోంది.

Read also-టాలీవుడ్ ‘రాక్ స్టార్’ మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. నెపోటిజం నుంచి బయటకు వచ్చి..

అల్లు అర్జున్ ట్వీట్‌లో..

Advertisement

అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఇలా రాసుకొచ్చారు. “మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ, మీకు లక్ష్మీ కటాక్షం, ప్రశాంతత, ప్రేమ పుష్కలంగా లభించాలని కోరుకుంటున్నాను. ఈసారి వచ్చింది టైగర్ కాదు… డ్రాగన్! ప్రతి షాట్‌లోనూ నిప్పులు చెరుగుతాడు.’ అంటూ రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించి ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

‘డ్రాగన్’ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?

సాధారణంగా ఎన్టీఆర్‌ను అభిమానులు ‘యంగ్ టైగర్’ అని పిలుచుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈసారి ‘టైగర్ కాదు.. డ్రాగన్’ అని సంబోధించడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్ ఫేమ్) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ లో సినిమా పేరును డ్రాగన్ గా ఖరారు చేశారు. ఇప్పటి వరకూ యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పటి నుంచి డ్రాగన్ అయి నిప్పులు చెరిగే ఫైర్ తో దూసుకుపోతారని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

Advertisement

Read also-పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ పెద్ది..

‘బావ’ బాండింగ్..

అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ సమకాలీన స్టార్ హీరోలు అయినప్పటికీ, వారి మధ్య మంచి స్నేహం, బంధుత్వం (బావ అని పిలుచుకునే వరస) ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో వీరిద్దరూ ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటూ సందడి చేశారు. ఇప్పుడు తారక్ బర్త్‌డే వేళ బన్నీ అంత్యంత ఆత్మీయంగా, అదే సమయంలో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎలివేట్ చేస్తూ పెట్టిన పోస్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను వేటాడటానికి సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు టాప్ హీరోల మధ్య ఉన్న ఈ హెల్తీ బాండింగ్ చూసి తెలుగు సినిమా ప్రేక్షకులు మురిసిపోతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×