E-Paper
Advertisement

Ban vs Pak: 15 సెకండ్లపై వివాదం..బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఫిర్యాదు..అంపైర్లు అమ్ముడుపోయారంటూ

Ban vs Pak: 15 సెకండ్లపై వివాదం..బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఫిర్యాదు..అంపైర్లు అమ్ముడుపోయారంటూ
Advertisement

Ban vs Pak:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య నిన్నటితో 3 వన్డేల సిరీస్ పూర్తయింది. ఈ 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఆదివారం బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడవ వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో 11 పరుగులు తేడాతో బంగ్లాదేశ్ విక్టరీ కొట్టింది. దీంతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే నిన్నటి మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన పాకిస్తాన్, ఓ వైడ్ కారణంగా ఓడిపోయింది. ఇప్పుడు ఇదే వైడ్ చుట్టూ కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. అంపైర్లు బంగ్లాదేశ్ కు అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఓడిపోయిందని PCB వింత వాదన వినిపిస్తోంది.

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

బంగ్లాదేశ్ పై ఫిర్యాదు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య నిన్న ఢాకా వేదికగా ( Shere Bangla National Stadium, Dhaka ) మూడవ వన్డే జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 290 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 279 పరుగులు సాధించి ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ చివరలో పాకిస్తాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది, ఒంటరి పోరాటం చేశాడు. చివరి బంతి వరకు ఆడాడు. అయితే పాకిస్తాన్ గెలవడానికి రెండు బంతుల్లో 12 పరుగులు కావలసిన అవసరం నిన్నటి మ్యాచ్ లో ఏర్పడింది. ఆ సమయంలో రిషాద్ హుస్సేన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఆ చివరి ఓవర్ అయిదవ బంతిని లెగ్ సైడ్ వేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ పాకిస్తాన్ కు అనుకూలంగా వైడ్ అని ఇచ్చాడు.

అయితే 15 సెకండ్లు పూర్తయిన తర్వాత రివ్యూ తీసుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు. అల్ట్రా ఎడ్జ్ లో చూస్తే షాహీన్ అఫ్రిది బ్యాట్ కు బంతి తగిలినట్లుగా తేలింది. దీంతో ఆ వైడ్ ను కాస్త క్యాన్సిల్ చేసి లీగల్ డెలివరీగా ప్రకటించారు థర్డ్ అంపైర్. దీని వల్ల పాకిస్తాన్ సమీకరణం ఒక్క బంతికి 12 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ ఒక్క బంతిలో ఒక్క పరుగు చేయకుండానే షాహీన్ అఫ్రిది ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే నిర్ణీత 15 సెకండ్లు ముగిసిన తర్వాత రివ్యూ తీసుకోవడం ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తుంది పాకిస్తాన్. ఈ మేరకు థర్డ్ అంపైర్ అమ్ముడుపోయాడ‌ని ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై ఐసీసీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైడ్ నేప‌థ్యంలో15 సెకండ్ల త‌ర్వాత రివ్యూ తీసుకోవ‌డంపై ఐసీసీకి ఫిర్యాదు చేసినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పాక్ సీరియ‌స్ అవుతోంది. ఐసీసీ బాస్ జై షా కావాలనే ప‌ట్టించుకోవ‌డం లేడ‌ని ఆగ్ర‌హిస్తోంది పాక్‌.

Advertisement

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు  నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×