E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజంకు CA కంపెనీ కోట్ల‌ల్లో ఆఫ‌ర్..ఆసియాలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్ !

బాబ‌ర్ ఆజంకు CA కంపెనీ కోట్ల‌ల్లో ఆఫ‌ర్..ఆసియాలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్ !
Advertisement

Babar Azam:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకు (Babar Azam) బంపర్ ఆఫర్ తగిలింది. అతనికి కోట్లల్లో డబ్బులు ఇచ్చేందుకు క్రీడా సామాగ్రి సంస్థ CA (CA Pakistan ).. ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెటర్లతో బంధం తెంపుకున్న CA… ఇప్పుడు మళ్లీ వాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకు ఏడాదికి రూ.2.10 కోట్లు ఇచ్చేలా స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని మళ్లీ చేసుకుంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

ఆసియా ఖండంలోనే తొలి ప్లేయర్ గా బాబర్

Advertisement

పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంతో CA క్రీడా సామాగ్రి సంస్థ… దాదాపు ఒప్పందం చేసుకున్నట్లేనని తెలుస్తోంది. ఈ క్రమంలో 2.10 కోట్ల ఆఫర్ చేసిందట. దీంతో బంగారంలా బంపర్ ఆఫర్ వచ్చిందని… సంతకాలు కూడా బాబర్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ ఒప్పందం కుదిరితే… బాబర్ ఆసియా ఖండంలోనే అత్యుత్తమ క్రికెటర్ గా రికార్డ్ సృష్టించనున్నాడు. ఇండియన్ క్రికెటర్లను వినాయ ఇస్తే… అత్యధిక స్పాన్సర్షిప్ పొందిన ఆటగాడిగా బాబర్ రికార్డు సృష్టిస్తాడు అన్నమాట.

వైభవ్ తీసుకునే దాంట్లో 30% మాత్రమే

బ్యాట్ స్పాన్సర్షిప్ విభాగంలో బాబర్ ఆజం కు 2.10 కోట్లు ఇచ్చేందుకు CA కంపెనీ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఆసియా ఖండంలోనే మొనగాడు అంటూ రెచ్చిపోతుంది. అయితే దీనికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. వైభవ్ తీసుకునే దాంట్లో 30% కూడా బాబర్ ఆజం రావడం లేదంటూ దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ( VAIBHAV SURYAVANSHI) అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాదికి 12 కోట్లు ఇచ్చేందుకు ఓ బ్యాట్ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో వైభవ్ సూర్య వంశీ.. ఆ కంపెనీతో ఒప్పందం కూడా చేస్తున్నాడట.

Advertisement

అంటే ఈ లెక్కన చూసుకుంటే బాబర్ ఆజం కంటే ఎక్కువ మొత్తంలో వైభవ్ డబ్బులు తీసుకుంటున్నాడన్నమాట. ఈ క్రమంలో వైభవ్ గురించి ప్రస్తావిస్తూ బాబర్ ఆజం పరువు తీస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. 15 ఏళ్ల బుడ్డోడి ముందు.. నువ్వు దేనికి పనికిరావు అంటూ బాబర్ ఇజ్జత్ మొత్తం తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. గత రెండు సంవత్సరాల కింద కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం, ఇప్పటికీ జట్టులో స్థానం కోసం పోరాడుతూనే ఉన్నాడు. వన్డేలు అలాగే టెస్టుల్లో స్థానం సంపాదించుకుంటున్న బాబర్, టి20 లో మాత్రం అవకాశాలను మెరుగుపరచుకోవడం లేదు.

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×