E-Paper
Advertisement

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !
Advertisement

Gambhir Warns Shreyas Iyer:  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా నిన్న తొలి మ్యాచ్ జరగగా, పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా జట్టును దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 T20 World Cup tournament) గెలిచి సత్తా చాటిన టీమిండియా, అనామక ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం ఏంటని ఆడుకుంటున్నారు. అయితే దీనిపై గౌతమ్ గంభీర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో గొడవకు కూడా దిగాడట గౌతమ్ గంభీర్. దాదాపు 30 నిమిషాల పాటు ఇద్దరు తన్నుకునే అంత గొడవ జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ ల‌లో టీమిండియా గెలవకపోతే కెప్టెన్సీ కూడా పీకి పారేస్తానని హెచ్చరించారట గౌతమ్ గంభీర్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:  Silver Siegers Missed Run out Tazmin Brits: ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు వార్నింగ్ !

Advertisement

ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా… పసికూన ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఐర్లాండ్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని కూడా చేదించలేక చేతులెత్తేసింది. ఐర్లాండ్ జట్టులో ఐదుగురు కీలక ప్లేయర్లు గాయాల బారిన పడగా… పిల్ల బచ్చాలు బరిలోకి దిగారు. అయినప్పటికీ టీమిండియా మాత్రం గెలవలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ఇద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు గొడవ జరిగినట్టు చెబుతున్నారు. మధ్యలో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ జోక్యం చేసుకున్నప్పటికీ… గంభీర్ బండ బూతులు తిట్టాడట. డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ అనంతరం శ్రేయస్ అయ్యర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట కోచ్ గౌతమ్ గంభీర్. ఐర్లాండ్ తో మిగిలిన టి20.. ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టీ20 లో సిరీస్ లో టీమిండియా కచ్చితంగా గెలవాలని దిశా నిర్దేశం చేశారట. ఒకవేళ టీమ్ ఇండియా గెలవకపోతే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారట గంభీర్. ఆ తర్వాత గొడవ కాస్త చల్లారినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ మ్యాచ్ లపై శ్రేయస్ అయ్యర్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ తొక్కేసేందుకు గంభీర్ కుట్ర‌లు ?

Advertisement

శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్సీ నుంచి కావాలనే తొలగించాలని గంభీర్ కుట్రకు తెరలేపినట్లు మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. ప్రసిద్ కృష్ణ , వాషింగ్టన్ సుందర్ లాంటి క్రికెటర్లను మొదటి టీ20 లో వద్దని శ్రేయస్ అయ్యర్ మొత్తుకున్నారట. అలాగే వైభవ్ సూర్యవంశీని మొదటి మ్యాచ్ లోనే బరిలోకి దింపాలని శ్రేయస్ అయ్యర్ భావించారట. కానీ గౌతమ్ గంభీర్ అడ్డుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లలో శ్రేయస్ అయ్యర్ ను ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్రించే కుట్ర గౌతమ్ గంభీర్ చేస్తున్నట్లు మరి కొంతమంది అంటున్నారు. అందుకే తుది జట్టు ఎంపికలో వేలు పెట్టి, శ్రేయస్ అయ్యర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా చేస్తున్నాడట. దాని ఫలితమే మొదటి టీ20 అని అంటున్నారు. గౌతమ్ గంభీర్ వేలు పెట్టినన్ని రోజులు శ్రేయస్ అయ్యర్ సక్సెస్ కావడం కష్టమే అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

Also Read:  Silver Siegers Missed Run out Tazmin Brits: ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

 

 

 

 

Also Read: PAT CUMMINS, TRAVIS HEAD TO MISS IPL 2027: అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×