E-Paper
Advertisement

YouTube Shortsలో బిగ్ చేంజెస్.. లైక్ బటన్ స్థానంలో హార్ట్ సింబల్, ఆ ఫీచర్ కంప్లీట్‌గా అవుట్!

YouTube Shortsలో బిగ్ చేంజెస్.. లైక్ బటన్ స్థానంలో హార్ట్ సింబల్, ఆ ఫీచర్ కంప్లీట్‌గా అవుట్!
Advertisement

YouTube: యూట్యూబ్ షార్ట్స్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. క్లియర్ స్క్రీన్ మోడ్, ఫాస్ట్ ప్లేబ్యాక్ వంటి సరికొత్త ఫీచర్లను యూట్యూబ్ పరిచయం చేసింది. షార్ట్స్ చూసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా, మరింత సులువుగా ఉండేలా ఈ మార్పులు తీసుకొచ్చింది సంస్థ . జూన్ 25 నుంచి ఈ కొత్త ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి.

క్లియర్ స్క్రీన్ మోడ్:

ఇకపై షార్ట్స్ చూసేటప్పుడు స్క్రీన్‌పై కనిపించే లైక్స్, కామెంట్స్ వంటి ఆప్షన్లు, టెక్స్ట్ ఏవీ కనిపించకుండా దాచేయవచ్చు. దీనికోసం ‘క్లియర్ స్క్రీన్’ మోడ్‌ను తెచ్చారు. తద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియోను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.

డబుల్ స్పీడ్ ప్లేబ్యాక్:

Advertisement

చాలా కాలంగా యూజర్లు కోరుకుంటున్న ‘2x ప్లేబ్యాక్ స్పీడ్’ ఫీచర్‌ను కూడా యూట్యూబ్ జోడించింది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడానికి లేదా వీడియోలను వేగంగా చూడటానికి వీలవుతుంది. అలాగే వీడియోను పాజ్ చేసి మ్యూట్ చేసుకునే కొత్త కంట్రోల్స్ కూడా వచ్చాయి.

Also Read: లీకైన యాపిల్ సీక్రెట్ ప్లాన్.. తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్‌లను మించిన ఫీచర్లతో iRing‌ను దించనుంది!

థంబ్స్-అప్ బదులు హార్ట్ సింబల్:

Advertisement

యూజర్ల ఎంగేజ్‌మెంట్‌ను పెంచేందుకు లైక్ బటన్‌లో మార్పు చేశారు. ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ థంబ్స్-అప్ (లైక్) ఐకాన్ స్థానంలో ఇకపై హార్ట్ సింబల్ కనిపించనుంది. వీడియోలపై తమ అభిమానాన్ని మరింత బాగా వ్యక్తపరచడానికి ఇది ఉపయోగపడుతుందని యూట్యూబ్ పేర్కొంది.

డిస్‌లైక్ బటన్‌కు గుడ్‌బై:

అలాగే షార్ట్స్ నుండి ‘డిస్‌లైక్’ బటన్‌ను పూర్తిగా తొలగించారు. ఒక వీడియో నచ్చకపోతే డిస్‌లైక్ కొట్టడం కంటే.. ‘నాట్ ఇంట్రెస్టెడ్’ లేదా ‘డోంట్ రికమండ్ దిస్ ఛానల్’ ఆప్షన్లను వాడాలని యూట్యూబ్ సూచిస్తోంది. దీనివల్ల యూజర్లకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో స్పష్టంగా అర్థం చేసుకుని, మంచి రికమండేషన్స్ ఇవ్వడానికి వీలవుతుంది.

ప్రస్తుతం రోజుకు 200 బిలియన్లకు పైగా వ్యూస్ సాధిస్తున్న షార్ట్స్‌లో ఈ సరికొత్త ఫీచర్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచనున్నాయి. ఇవి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Also Read: కలా? నిజమా? రూ.1699కే టైప్-సి ఛార్జింగ్, 55 రోజుల బ్యాటరీ లైఫ్‌తో క్రేజీ ఫోన్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×