E-Paper
Advertisement

YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్‌లోనే చాటింగ్, వీడియో షేరింగ్!

YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్‌లోనే చాటింగ్, వీడియో షేరింగ్!
Advertisement

YouTube: యూట్యూబ్ తమ వినియోగదారుల కోసం క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు యాప్ నుండి బయటకు వెళ్లకుండానే తమకు నచ్చిన వీడియోలను స్నేహితులతో పంచుకోవచ్చు. అలాగే వారితో నేరుగా చాట్ కూడా చేయొచ్చు. మొదట ఐర్లాండ్, పోలాండ్‌లలో కొద్దిమందితో పరీక్షించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ, సింగపూర్ సహా ప్రపంచవ్యాప్తంగా మరో 40 దేశాలకు విస్తరించింది.

యాప్‌లోనే వీడియో షేరింగ్:

ఈ కొత్త అప్‌డేట్ వల్ల యూట్యూబ్ చూసే అనుభవం మరింత సులువుగా మారనుంది. సాధారణంగా మనకు ఏదైనా వీడియో నచ్చితే దాని లింక్‌ను కాపీ చేసి, వాట్సప్ లేదా టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లలోకి వెళ్లి షేర్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. యూట్యూబ్ యాప్‌లోనే ఉంటూ మనకు నచ్చిన వీడియోను నేరుగా అవతలి వ్యక్తికి పంపించవచ్చు. కేవలం సాధారణ వీడియోలకే పరిమితం కాకుండా షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్, క్రియేటర్ల అప్‌లోడ్స్ ఇలా వేటినైనా దీనిలో సులభంగా షేర్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఈ వానలకు వేడి వేడి ఫ్రైలు తినాలనిపిస్తుందా? అయితే ఈ Air Fryers మీ కిచెన్‌లో ఉండాల్సిందే!

స్నేహితులతో ముచ్చట్లు:

ఈ ఫీచర్ ద్వారా వీడియోలను పంచుకోవడమే కాకుండా.. వాటి గురించి అక్కడికక్కడే మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. మనం పంపిన వీడియోలకు స్నేహితులు రియాక్ట్ అవ్వడమే కాకుండా రిప్లై కూడా ఇవ్వవచ్చు. దీనికోసం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి, నచ్చిన వీడియోను సెలెక్ట్ చేసుకుని షేర్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారిని ఎంచుకోవచ్చు లేదా చాట్ చేయడానికి కొత్తగా ఇన్విటేషన్ పంపొచ్చు. ఈ ఫీచర్ 18 ఏళ్లు పైబడిన వారికి, లేటెస్ట్ యాప్ వాడుతున్న వారికి అందుబాటులో ఉంటుంది.

కొత్త ఇన్విటేషన్ లింక్:

Advertisement

యూట్యూబ్‌లో దీనికోసం ప్రత్యేకంగా ఒక మెసేజెస్ విభాగం ఉంటుంది. ఎవరితోనైనా కొత్తగా సంభాషణ ప్రారంభించాలనుకుంటే, ఆ సెక్షన్‌కు వెళ్లి Invite to chat ద్వారా లింక్ పంపవచ్చు. అవతలి వ్యక్తి ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తే ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకోవచ్చు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇన్విటేషన్ లింక్ కేవలం 7 రోజులు మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి.

మరింత పెరగనున్న సోషల్ బంధం:

యూట్యూబ్ కేవలం వీడియోలు చూసే ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా.. ఒక సోషల్ మీడియా వేదికలా మారాలని చూస్తోంది. యాప్‌లోనే మెసేజింగ్ సదుపాయాన్ని తీసుకురావడం ద్వారా యూజర్లు బయటి యాప్‌లకు వెళ్లకుండా ఎక్కువ సమయం ఇక్కడే గడిపేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఫీచర్లు మరింతగా విస్తరిస్తే.. రాబోయే రోజుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియోలను పంచుకుంటూ ముచ్చటించుకోవడానికి యూట్యూబ్ ఒక ప్రధాన వేదికగా మారే అవకాశం ఉంది.

Also Read: షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×