E-Paper
Advertisement

యూట్యూబ్ టిప్స్.. 500 సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఇక డబ్బులొస్తాయ్, ఇలా చేస్తే చాలు!

యూట్యూబ్ టిప్స్.. 500 సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఇక డబ్బులొస్తాయ్, ఇలా చేస్తే చాలు!
Advertisement

Youtube Tips: యూట్యూబ్‌లో వీడియోలు చేయడం అంటే ఒకప్పుడు కేవలం సరదానే కానీ.. ఇప్పుడు అదొక మంచి ఆదాయ మార్గం. ఈ క్రమంలో చాలామంది మాకు వెయ్యి మంది సబ్‌స్క్రైబర్లు ఎప్పుడు వస్తారు? ఇంకెప్పుడు డబ్బులు సంపాదిస్తాం? అని వాపోతుంటారు. కానీ ఇప్పుడా పాత రూల్ మారింది. యూట్యూబ్ తన నిబంధనలను చాలా వరకు తగ్గించేసింది. కేవలం 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా సరే.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకోవచ్చు. అది ఎలాగో, అసలు కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సగం మందితో యూట్యూబ్ పార్ట్‌నర్:

మునుపటితో పోలిస్తే ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ కంటెంట్ క్రియేటర్లకు మేలు చేసేలా ఉన్నాయి. ఇంతకుముందు 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటేనే ‘యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్’లో చేర్చుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను సగానికి తగ్గించేశారు. మీ ఛానల్‌లో 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉండి.. గత మూడు నెలల్లో కనీసం మూడు వీడియోలు అప్‌లోడ్ చేసి ఉంటే చాలు.. మీరు అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. అయితే దీనితో పాటు ఏడాదిలో 3,000 గంటల వాచ్ టైమ్ లేదంటే మూడు నెలల్లో 30 లక్షల షార్ట్స్ వ్యూస్ సాధిస్తే మీ పని ఇంకా సులువు అవుతుంది.

యాడ్స్ రాకపోయినా డబ్బులు ఎలా వస్తాయి?

Advertisement

చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే.. 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పుడు వీడియోల మీద ప్రకటనలు రావు కదా, మరి డబ్బులు ఎలా వస్తాయని? ఇక్కడే ‘యూట్యూబ్ ఫ్యాన్ ఫండింగ్’ అనే ఆప్షన్ ఇచ్చింది. మీ కంటెంట్ నచ్చి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకునే ప్రేక్షకులు ‘సూపర్ చాట్స్’ లేదంటే ‘సూపర్ థాంక్స్’ ద్వారా మీకు కొంత డబ్బు పంపవచ్చు. అలాగే ‘ఛానల్ మెంబర్‌షిప్స్’ ద్వారా మీకు కావాల్సిన వాళ్లు నెలకు కొంత అమౌంట్ చెల్లించి మీ ఛానల్‌లో జాయిన్ అవ్వొచ్చు. దీంతో నేరుగా మీ ఫ్యాన్సే మీ సంపాదనకు సాయం చేస్తారన్నమాట.

యాడ్స్‌తో పనిలేదిక:

ఏదైనా బిజినెస్ ఉన్నా లేదంటే సొంతంగా టీ షర్టులు, ఇతర వస్తువులు డిజైన్ చేస్తున్నా.. వాటిని ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ ఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నవారికే అందుబాటులోకి వచ్చేసింది. మీ వీడియో కిందే మీ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి కాబట్టి.. చూసే వాళ్లకు నచ్చితే వెంటనే కొనే అవకాశం ఉంటుంది. ఇలా యాడ్స్ మీద ఆధారపడకుండానే మీ బ్రాండ్‌ను మీరు బిల్డ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఈ దెబ్బకి ఐఫోన్ కెమెరాను మర్చిపోవాల్సిందే.. జైస్ కెమెరాతో Vivo X300 FE ఎంట్రీ!

అది మాత్రం పాత పద్ధతే:

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.. మన వీడియోల మధ్యలో వచ్చే కమర్షియల్ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు మాత్రం పాత పద్ధతిలోనే వస్తుంది. దాని కోసం మాత్రం మీరు ఖచ్చితంగా 1,000 మంది సబ్‌స్క్రైబర్ల మైలురాయిని చేరుకోవాల్సిందే. అలాగే 4,000 గంటల వాచ్ టైమ్ కూడా పూర్తి చేయాలి. కాబట్టి.. మీరు 500 మందితో సంపాదన మొదలుపెట్టి, నెమ్మదిగా వెయ్యి మంది వైపు అడుగులు వేయాలన్నమాట. ఇది ఒక రకంగా చిన్న క్రియేటర్లకు ఇచ్చే బూస్ట్ లాంటిది.

డబ్బులతో పాటు ఇవి కూడా ముఖ్యమే:

కేవలం సబ్‌స్క్రైబర్లు పెరిగితే సరిపోదు.. మీ ఛానల్ సేఫ్‌గా ఉండటం కూడా ముఖ్యం. మీ ఛానల్‌పై ఎలాంటి కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ లేకుండా చూసుకోవాలి. అంటే.. వేరే వాళ్ల వీడియోలు కాపీ చేయడం లేదంటే తప్పుడు సమాచారం ఇవ్వడం లాంటివి చేయకూడదు. అలాగే సెక్యూరిటీ కోసం ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ కచ్చితంగా ఆన్ చేసి ఉంచుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. తక్కువ మంది సబ్‌స్క్రైబర్లతోనే మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇకెందుకు ఆలస్యం.. వీడియోలు మొదలుపెట్టండి మరి.

Also Read: 10x ఆప్టికల్ జూమ్, 200MP కెమెరా.. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక మీరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×